అశోక్ గజపతి బాబుకు.. కూతురు జగన్ కు జై

Update: 2020-01-23 11:26 GMT
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు సహా ఉత్తరాంద్ర నేతలంతా విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వ్యతిరేకించారు. పార్టీ అభిమానం కంటే తమకు ప్రాంతీయ అభిమానమే మేటి అని నిరూపించారు.

కానీ అదే ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ లో ఎదిగి కేంద్రమంత్రి కూడా అయిన అశోక్ గజపతి రాజు మాత్రం తనకు ప్రాంతీయ అభిమానం కంటే పార్టీ అభిమానమే మేటి అని చాటారు. ఉత్తరాంద్ర ప్రజల మనోభావాల కంటే చంద్రబాబు మాటే మిన్న అని ‘అమరావతి’కి జై కొట్టారు. సీఎం జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకం అని.. చంద్రబాబు బాటలో నడుస్తామని విజయనగరం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు క్లారిటీ ఇచ్చారు.

అయితే అంత మంది ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖకు జై కొట్టినా కానీ మారని అశోక్ గజపతి రాజుకు తాజాగా సొంత కుటుంబంలోనే షాక్ తగిలింది. అశోక్ గజపతిరాజు అన్న కూతురు సంచిత తాజా గా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. మాజీ మంత్రి, ఎంపీగా పనిచేసిన ఆనంద గజపతి రాజు కుమార్తె నే సంచిత. ప్రస్తుతం ఈమె బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు.

బీజేపీ పార్టీ 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నా కూడా ప్రాంతీయ అభిమానాన్ని చంపుకోకుండా సంచిత తన బాబాయ్ అశోక్ గజపతిని, బీజేపీని వ్యతిరేకించి మరీ జగన్ తీసుకున్న విశాఖపట్నం రాజధానికి జై కొట్టడం సంచలనంగా మారింది.
Tags:    

Similar News