ఆ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ ముదిరి పోయారు, హోస్ట్‌ మాటే వినలేదు

Update: 2020-11-03 15:30 GMT
ఇండియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా విన్నా కూడా బిగ్‌ బాస్ ముచ్చట్లు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. హిందీ బిగ్‌ బాస్‌ తో పాటు తెలుగు మరియు తమిళ బిగ్‌ బాస్‌ లు కూడా నడుస్తున్నాయి. తెలుగు మరియు తమిళ నాల్గవ సీజన్‌ లు కొనసాగుతుంటే హిందీ బిగ్‌ బాస్‌ 14వ సీజన్‌ సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ గా సాగుతుంది. హిందీ బిగ్‌ బాస్‌ ఎప్పటికప్పుడు చాలా సీరియస్‌ గా సాగుతూ ఉంటుంది. కంటెస్టెంట్స్‌ విషయంలో సల్మాన్‌ ఖాన్‌ ఎప్పుడు సీరియస్‌ గా ఉంటాడు. ఏమైనా తప్పు చేస్తే వారిని ఓ రేంజ్‌ లో వాయిస్తూ ఉంటాడు. తాజాగా గత వారం కవిత మరియు ఈజాజ్‌ ఖాన్‌ ల విషయంలో జరిగిన గొడవ వీకెండ్‌ ఎపిసోడ్‌ లో చర్చకు వచ్చింది.

ఏ గొడవను అయిన సల్మాన్‌ ముందుకు తీసుకు వచ్చి పరిష్కరించుకుంటూ ఉంటారు. కాని వీకెండ్‌ ఎపిసోడ్‌ లో సల్మాన్‌ ఖాన్‌ ముందు కూడా కవిత మరియు ఈజాజ్‌ లు గొడవ పడ్డారు. ముఖ్యంగా కవిత తాను లాక్‌ డౌన్‌ టైమ్‌ లో ఈజాజ్‌ కు ఎంతో సాయంగా నిలిచాను. కాని ఆయన మాత్రం విశ్వాసం చూపించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కెప్టెన్సీ టాస్క్‌ సమయంలో ఇద్దరి మద్య వాడి వేడి చర్చ జరిగింది. అది వీకెండ్‌ ఎపిసోడ్‌ కు కూడా కంటిన్యూ అయ్యింది.

సల్మాన్‌ ముందు కవిత అరుస్తూనే ఉంటే నేను ఎందుకు ఇక్కడ వెళ్లి పోతాను మీరే మాట్లాడుకోండి అంటూ సల్మాన్‌ అక్కడ నుండి పోయిన ప్రోమోను విడుదల చేశారు. తెలుగు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ ముదుర్లు అంటే వారిని మించిన వారు హిందీలో ఉన్నారే అంటూ తెలుగు నెటిజన్స్‌ ఆ ప్రోమోకు కామెంట్స్‌ చేస్తున్నారు. హోస్ట్‌ మాట వినని వారిని ఎలా కంటిన్యూ చేస్తారంటూ సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కవితను వెంటనే ఎలిమినేట్‌ చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News