సచిన్ ను వదలని ధోని అభిమానులు
భారత క్రికెట్ లో ఇద్దరు దిగ్గజాలే.. ఒకరేమో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు తీసిన ఆటగాడిగా ఉన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. మరొకరు సచిన్ కు సైతం తీరని ప్రపంచకప్ కలను రెండు సార్లు నెవరేర్చిన అద్భుత కెప్టెన్ ధోని. ఇద్దరిలో ఒకరు ఆటగాడిగా హిట్ అయితే .. కెప్టెన్ గా ధోని నిరూపించుకున్నాడు. సచిన్ మాత్రం కెప్టెన్సీలో విఫలమయ్యాడు. ఎవరి ప్లస్ లు వారికున్నాయి. కానీ సచిన్ తాజాగా టీమిండియా బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న ధోనిపై నోరుపారేసుకోవడంతో చిక్కువచ్చిపడింది.
ఇద్దరూ ఇద్దరే.. టెండూల్కర్ - ధోనిలను తక్కువ అంచనావేయడానికి వీల్లేదు.కానీ ప్రపంచకప్ లో కామెంట్రీ మొదలు పెట్టిన సచిన్.. ఆఫ్ఘాన్ తో మ్యాచ్ లో జిడ్డుగా ఆడిన ధోనిపై విమర్శలు చేయడంతో ధోని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆ క్రికెట్ దేవుడిపైనే ట్రోలింగ్ మొదలు ెట్టారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ధోని - సచిన్ ఫ్యాన్స్ మధ్య పెద్ద సోషల్ వార్ కొనసాగుతోంది. ధోనిని తిడతావా అంటూ అందరూ సచిన్ బ్యాటింగ్ లోని లోపాలను ఎత్తిచూపుతూ ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇక సచిన్ ఫ్యాన్స్ కూడా ధోని పేలవ పర్ ఫామెన్స్ గణంకాలు తీస్తూ కౌంటర్ ఇస్తున్నారు.
ఇక సచిన్ ది గోల్డెన్ బౌల్ జీవితమని.. ధోనిది కష్టాల మయం అంటూ వారిద్దరి బయోపిక్ లను తీస్తూ కూడా అభిమానులు వాదులాడుకుంటున్నారు. ప్రపంచకప్ లో పరుగులను వివరిస్తూ మా క్రీడాకారుడే గ్రేట్ అంటున్నారు. ఇలా ధోనిపై నోరుజారిన సచిన్ వివాదానికి ఆజ్యం పోయగా.. వారి ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తున్నారు.