ఏపీ పోలీస్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. రంగంలోకి కేంద్రమంత్రి తర్వాతేమైంది?

Update: 2020-09-20 11:50 GMT
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అనుకోని రీతిలో చోటు చేసుకున్న పరిణామం పలు మలుపులు తిరగటమే కాదు.. కేంద్రమంత్రి నేరుగా సీన్లోకి వచ్చే పరిస్థితి చోటు చేసుకుంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో టెన్షన్ పుట్టించిన ఈ ఉదంతంలో అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం కోసం సంఘ్ కార్యకర్తలు వచ్చారు. వారిని అనుమతించే విషయంలో ఏపీ పోలీసులతో పాటు ఆలయ సెక్యురిటీ సిబ్బందికి మధ్య గొడవ చోటు చేసుకుంది. తమ పట్ల పోలీసులు.. సెక్యురిటీ సిబ్బంది దురుసుగా వ్యవహరించారన్నది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల వాదన. ఇదిలా ఉండగా.. విషయం పెద్దది కావటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీంతో.. తమ కార్యకర్తల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించటాన్ని సీరియస్ గా తీసుకున్న ఆర్ ఎస్ఎస్ నేతలు వెంటనే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని లైన్లోకి తీసుకున్నారు. సంఘ్ కార్యకర్తల విషయంలో ఏపీ పోలీసులు.. ఆలయ భద్రతా సిబ్బంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు.
దీంతో నేరుగా సీన్లోకి వచ్చిన కిషన్ రెడ్డి.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను లైన్లోకి తీసుకున్నారు. సంఘ్ కార్యకర్తల విషయంలో చోటు చేసుకున్న పరిణామాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. అన్ని వివరాలు సేకరించిన ఏపీ డీజీపీ.. సంఘ్ కార్యకర్తలతో దురుసుగా వ్యవహరించిన ఆలయానికి చెందిన నలుగురు సెక్యురిటీ సిబ్బందిని తొలగించటమేకాదు.. శ్రీశైలం సెక్యూరిటీ ఆఫీస్ పై బదిలీ వేటు వేశారు. ఈ ఉదంతం లో అత్యుత్సాహానికి పోయిన మరో ముగ్గురు కానిస్టేబుళ్ల పై బదిలీ వేటు వేశారు. ఈ పరిణామం స్థానికంగా సంచలనం గా మారింది.
Tags:    

Similar News