రూ. 200 కోట్ల దళారీ..రూ.70 కోట్ల కార్లు , తీహార్ జైల్లో నిందితుడు
కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు కావాలా, ఎవరినైనా , ఎక్కడికైనా బదిలీలు చేయించాలా, సీబీఐ కేసుల నుంచి తప్పించాలా , ఇలా ఒకటి కాదు , రెండు కాదు దేశ రాజధానిలో అన్నిపనులని నేనే చూసుకుంటా అంటూ మభ్యపెట్టి రూ.200 కోట్ల లావాదేవీలు నెరపిన చెన్నైకి చెందిన ఖరీదైన దళారీ బండారం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు చెన్నైలోని సుకేష్ చంద్రశేఖర్ అనే దళారి ఇంటిపై సోమవారం చేసిన దాడులతో భారీ మోసాల కోణం వెలుగుచూసింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సాధించి పెడతానని రూ.2 కోట్లు లంచం పుచ్చుకున్న కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేఖర్ కు చెందిన చెన్నై కానత్తూరులోని ఇంటిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సోమవారం పెద్దఎత్తున దాడులు నిర్వహంచారు.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత 2015లో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి శశికళ, మరో వర్గానికి ఓ పన్నీర్‌సెల్వం సారథ్యం వహించారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కే నగర్ ఖాళీగా మారడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థిగా టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వం అభ్యర్థిగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ బరిలోకి దిగారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీ వద్ద ఇద్దరూ పోటీపడ్డారు. దీంతో రెండాకుల చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించి ఎవ్వరికీ కేటాయించలేదు. దీంతో రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతంతో టీటీవీ దినకరన్.. దళారి సుకేష్ చంద్రశేఖర్‌ను కలిసి రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అడ్వాన్స్‌గా రూ.2 కోట్లు పుచ్చుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈడీ అధికారులు సుకేష్ చంద్రశేఖర్‌ను 2017లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆనాటి నుంచి సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన 16 మంది ఈడీ అధికారులు సోమవారం తెల్లవారుజామున చెన్నై కానత్తూరులోని సుకుష్ చంద్రశేఖర్ ఇంటిపై మెరుపుదాడులు చేసి తనిఖీలు ప్రారంభించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రూ.70 కోట్ల విలువైన 20 లగ్జరీ కార్లు, కారవాన్, నిందితుడి ఇంటిలోని లాప్ ట్యాప్, లెక్కల్లో చూపని రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ వద్ద 10 రోజుల క్రితం ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, సీబీఐ అధికారుల పేర్లు చెప్పి పనులు, బదిలీలు చేయిస్తానని పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల నుంచి సుమారు రూ.200 కోట్లు, ఖరీదైన బహుమతులు పొందినట్లు బయటపడింది. అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే చెన్నైలోని ఇంట్లో సోదాలు చేపట్టారు.
సుకేష్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేశాడు. 17 ఏళ్ల యవసులో తొలిసారిగా ఒక స్కాంలో ఇతగాడి పేరు బయటకు వచ్చింది. తన సొంత ఊళ్లో బ్రోకర్‌గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను అమ్మేసేవాడు. అప్పటికి మైనర్ కావడంతో అరెస్టు చేయలేకపోయారు. కానీ ఏడాది తర్వాత సరిగ్గా అదే పద్ధతిలో చెన్నైలో పెద్ద వ్యవహారం చేస్తూ దొరికేసి, కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత ఉత్తరాదికి వ్యాపారాన్ని విస్తరించాడు. నకిలీ బీమా పాలసీలు అమ్ముతూ అతి తక్కువ కాలంలో 3 వేల కోట్లు సంపాదించాడు. తనను తాను ఎంపీగా చెప్పుకోడానికి నకిలీ ఐడీ కార్డులు కూడా వాడేవాడట. మద్రాస్ కేఫ్, బిర్యానీ లాంటి సినిమాల్లో నటించిన లీనా మేరీ పాల్‌ను చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీళ్లిద్దరినీ 2015 సంవత్సరంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కారణం మోసం చేయడమే.