• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజ్యసభ సీటు కోసమే రూ.100...

రాజ్యసభ సీటు కోసమే రూ.100 కోట్ల దావా!

By - Tupaki Desk
Update: 2021-03-12 09:30 GMT
ఆరేడు నెలల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ మాటకు వస్తే.. అదే అంశం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రచ్చగా మారింది. ఆ అంశంపై ఏపీ బీజేపీనేతలు కూడా తీవ్రంగా స్పందించారు. జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. కట్ చేస్తే.. ఆ అంశానికి సంబంధించి టీటీడీ ప్రతిష్ఠను డ్యామేజ్ చేసేలా ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తుందని.. అందులో భాగంగా కథనాల్ని ప్రచురించరన్న ఆరోపణతో రూ.100 కోట్ల మొత్తానికి దావా వేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి. ఆయన లాంటి వ్యక్తి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చి హడావుడి చేసిన వైనం సంచలనంగా మారింది.

తాను ఏదైనా అంశాన్ని టార్గెట్ చేస్తే.. ఎలా ఉంటుందో తెలుసు కదా? అన్న స్టేట్ మెంట్ తో వాతావరణం మరింత వేడెక్కింది. ఆర్నెల్ల క్రితం మీడియా సంస్థలో ప్రచురించిన కథనం మీద పరువు నష్టం దావా వేయకూడదన్న రూల్ లేదు కానీ.. ఏదైనా చేస్తే వెంటనే స్పందిస్తారు. మరీ.. ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించినట్లు ? అన్నది ప్రశ్న. అంతేకాదు.. ఇదే అంశంపై మిగిలిన మీడియా సంస్థలు కథనాలు అచ్చేసినా వారి మీద ఎలాంటి దావాలు లేకపోవటం ఇప్పుడు చర్చగా మారింది.

అన్నింటికి మించి.. ఇదే అంశంపై ఏపీ బీజేపీనేతలు తీవ్రంగా స్పందిస్తే.. అదే పార్టీకి చెందిన సుబ్రమణ్య స్వామి మాత్రం.. కథనాలు అచ్చేసిన పత్రిక మీద రూ.100 కోట్లకు దావాలు వేయటం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఛౌర్మన్ గురునాథం ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం త్వరలో (2022)ముగుస్తుందని.. తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం కోసమే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు మధ్యనున్న  విభేదాల గురించి అందరికి తెలిసిందే. దీంతో.. ఆంధ్రజ్యోతిని స్వామి లాంటి లిటిగెంట్ లాయర్ తో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనను సీఎం జగన్ చేసి ఉంటారని.. అందుకే రూ.100 కోట్ల పరువునష్టం దావా వ్యవహారం తెర మీదకు వచ్చినట్లుగా విశ్లేషిస్తున్నారు. స్వామి ట్రాక్ రికార్డు చూస్తే.. ఆయన ఏదైనా విషయాన్ని టేకప్ చేస్తే.. ఆ అంశం లోతుల్లోకి వెళ్లిపోతారు. తాజాగా ఎపిసోడ్ లో కూడా తనకు ప్రత్యర్థిగా ఉన్న ఆంధ్రజ్యోతిని దెబ్బేయటం కోసం స్వామితో ఏపీ సీఎం దావా వేసినట్లుగా కొందరు చెబుతున్నారు. ఇలా చేసినందుకు ప్రతిఫలంగా స్వామికి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ కారణంతోనే రూ.100 కోట్ల దావా తెర మీదకు వచ్చినట్లుగా  చెబుతున్నారు.అందులో నిజం ఎంతవరకన్నది కాలమే బదులివ్వాలి.
Tags:    
  • Subramanian Swamy 
  • BJP MP 
  • Rajya Sabha 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS