రోజా సెంటిమెంట్.. లగడపాటిది దొంగసర్వే

Update: 2019-05-22 06:21 GMT
తెల్లవారితే ఎన్నికల ఫలితాలు కావడంతో నేతలంతా దేవుళ్లకు పూజలు చేసి తమను గెలిపించాలని కోరేందుకు బయలు దేరారు. ఏపీ సీఎం చంద్రబాబు.. తాను పోటీచేస్తున్న కుప్పం నియోజకవర్గంలో గంగమ్మతల్లికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు అప్పజెప్పారు..

సాధారణంగా   చంద్రబాబుకు అంత దైవభక్తి ఏమీ లేదు. కేసీఆర్ తో పోల్చితే చాలా తక్కువే. కేసీఆర్ మాత్రం ప్రతీది ముహూర్తం చూసి.. పండితులు - పీఠాధిపతులను సంప్రదించి చేస్తుంటాడు. గెలుపు కోసం యజ్ఞాలు - హోమాలు చేస్తుంటారు. కానీ ఏపీ సీఎంలో ఆధ్యాత్మికత కాస్త తక్కువే.

కాగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ వెల్లువెత్తిన వేళ చంద్రబాబు కూడా ఓటమి భయంతో దేవుడి బాట పట్టినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లిన బాబు.. తాజాగా అక్కడి నుంచి హెలీక్యాప్టర్ తో తన కుప్పం నియోజకవర్గానికి వచ్చారు. అక్కడ తమ కులదైవమైన గంగమ్మ తల్లికి మొక్కులు మొక్కారు..

ఇక వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సైతం ఈరోజు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు మొక్కుకున్నారు. దర్శనం అనంతరం మీడియా ముందుకు వచ్చి లగడపాటి సర్వేను దొంగ సర్వేగా అభివర్ణించారు. తెలంగాణ - తమిళనాడు ఎన్నికల ఫలితాలతో లగడపాటిది తప్పుడు సర్వే అని తేలిందన్నారు.  నగరిలో తాను ఓడిపోతానన్న అంచనాలు తప్పు అని.. తాను ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తోందని.. రేపటి ఫలితాల్లో వైసీపీ గెలిచి మళ్లీ రాజన్నరాజ్యాన్ని జగన్ తెస్తాడని రోజా ధీమా వ్యక్తం చేశారు.



Tags:    

Similar News