క్లిక్ అయితే కోట్లు కొట్టిన‌ట్లే.. ఆట‌గాళ్ల‌పై డ‌బ్బుల‌ వ‌ర్షం ఎందుకు?

హార్దిక్ పాండ్యా.. అన్న‌య్య క్రునాల్ పాండ్యాతో క‌లిసి ఒక‌టే బ‌న్ కొనుక్కుని తిని క‌డుపు నింపుకొన్నాడు.;

Update: 2025-12-13 11:24 GMT

ల‌యోన‌ల్ మెస్సీ.. బాల్యంలో గ్రోత్ (ఎదుగుదల‌) హార్మోన్ లోపం కార‌ణంగా ఇబ్బందిప‌డ్డాడు. క్రీడ‌ల‌ను కెరీర్ గా ఎంచుకుని ఇప్పుడు ఫుట్ బాల్ లో శిఖ‌రాల‌కు చేరాడు.

హార్దిక్ పాండ్యా.. అన్న‌య్య క్రునాల్ పాండ్యాతో క‌లిసి ఒక‌టే బ‌న్ కొనుక్కుని తిని క‌డుపు నింపుకొన్నాడు. ఇప్పుడు రూ.వంద‌ల కోట్లను కేవ‌లం చేతి వాచీల‌కే ఖ‌ర్చుపెడుతున్నాడు.

ఒక‌ప్పుడు గ్రౌండ్ కు వెళ్లి ఆట‌లాడితే త‌ల్లిదండ్రులు తిట్టేవారు. కొట్టేవారు కూడా. కానీ, అదే త‌ల్లిదండ్రులు ఇప్పుడు పిల్ల‌ల‌ను గ్రౌండ్ల‌కు తీసుకెళ్లి మ‌రీ ఆట‌ల్లో చేర్పిస్తున్నారు. కేవ‌లం రెండు, మూడు ద‌శాబ్దాల్లో ప‌రిస్థితుల్లో

ఇంత‌టి మార్పున‌కు కార‌ణం.. క్రీడ‌లు డ‌బ్బులు ఇబ్బడిముబ్బ‌డిగా ఆర్జింజి పెట్టేవి మార‌డ‌మే. ఒక్క‌సారి క్లిక్ అయితే చాలు ఇక ఆట‌గాళ్ల జీవితం మారిపోయిన‌ట్లే. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) వంటి టోర్నీ వేలంలో చేరి మ్యాచ్ లో రాణిస్తే వారు సెల‌బ్రిటీ అయిపోయిన‌ట్లే. ఇదంతా కేవ‌లం క్రీడ‌లు తెచ్చిన మార్పు.

లీగ్ లు వ‌చ్చాయి.. జాత‌కాలు మార్చాయి..

రెండు ద‌శాబ్దాల కింద‌ట టి20 క్రికెట్ అంటే ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు టి20లు అంటేనే క్రికెట్ అంటున్నారు. అంత‌గా మార్పు వ‌చ్చింది. ముఖ్యంగా ఐపీఎల్ వ‌చ్చాక వంద‌ల మంది క్రికెట‌ర్ల జీవితం ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఈ లిగ్ తోనే రూ.వంద‌ల కోట్లు సంపాదించిన స్టార్ క్రికెట‌ర్లు ఉన్నారంటేనే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఐపీఎల్ తెచ్చిన మార్పుతో బ్యాడ్మింట‌న్, క‌బ‌డ్డీ, టెన్నిస్, హాకీ, ఫుట్ బాల్ ఇలా ప్ర‌తి క్రీడ‌లోనూ లీగ్ ల క‌ల్చ‌ర్ మొద‌లైంది. మ్యాచ్ ఫీజులు, లీగ్ కాంట్రాక్టులతో ప్లేయ‌ర్ల‌పై డ‌బ్బుల వ‌ర్షం కుర‌వ‌సాగింది.

యాడ్స్ లో.. సోష‌ల్ మీడియాలోనూ అదుర్స్..

ఆట‌తో వ‌చ్చిన పాపులారిటీ సోష‌ల్ మీడియాలో ప‌నికివ‌చ్చి రూ.కోట్లు సంపాదించేస్తున్నాడు విరాట్ కోహ్లి. అత‌డు ఒక్క పోస్ట్ పెడితే రూ.కోట్లకు కోట్లు ఇచ్చే ప‌రిస్థితి. కోహ్లికి ఇది చిన్న మొత్త‌మే కానీ.. అప్పుడే ఎదుగుతున్న ప్లేయ‌ర్ల‌కు పెద్ద మొత్త‌మే క‌దా? ఇక అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్లతో కోట్లు సంపాదిస్తున్న ఆటగాళ్లకైతే లెక్కే లేదు.

ఎటుచూసినా డ‌బ్బే..

స్పాన్స‌ర్లు, టీవీ, ఓటీటీ ప్ర‌సార హ‌క్కులను రూ.వేల కోట్లు పెట్టి సొంతం చేసుకుంటున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. ఐపీఎల్ లో ఆట‌గాళ్ల పారితోషికాల‌ను నిర్ణ‌యించ‌డంలో మ్యాచ్ బ్రాడ్ కాస్టింగ్ రేట్లు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. ఐఎస్ఎల్, బ్యాడ్మింట‌న్ లీగ్ ల‌లోనూ ఇదే ధోర‌ణి క‌నిపిస్తోంది.

జెన్ జీకి ప్యాష‌న్ ప్రొఫెష‌న్..

జెన్ జీకి ఇప్పుడు ఇష్ట‌మైన కెరీర్ ల‌లో స్పోర్ట్స్ చేరింది. సోష‌ల్ మీడియా ప్ర‌భావం, ఆట‌గాళ్ల‌కు ద‌క్కుతున్న ఆద‌ర‌ణ‌, డ‌బ్బు, ఖ‌రీదైన లైఫ్ స్ట‌యిల్ మాత్ర‌మే కాక ఫోన్ల‌కు దూరంగా ఉండేందుకు ఫిట్ నెస్ మంత్రాగా కూడా స్పోర్ట్స్ ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఫ్రాంచైజీల పెట్టుబ‌డులు, సోష‌ల్ మీడియా, బ్రాడ్ కాస్టింగ్, స్పాన్స‌ర్ షిప్ లు, క‌మ‌ర్షియ‌ల్ డిమాండ్లు ఆట‌గాళ్ల‌ను బ్రాండ్లు, ఇన్వెస్ట్ మెంట్ అసెట్స్, ఎంట‌ర్ టైన్ మెంట్ ఐకాన్లుగా మార్చాయి.

Tags:    

Similar News