బాబు మూటలు...కేసీఆర్ మాటలు
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయ హీట్ ను పెంచుతోంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమ మాటలకు పదును పెడుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. సెటైర్లకు - కామెంట్లకు పెట్టింది పేరైన నాయకులు తమదైన శైలిలో చెణుకులు విసురుతున్నారు. బలం లేకున్నా బరిలో దిగి...వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో లక్ ను పరీక్షించుకోవాలని డిసైడయిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సినీ గ్లామర్ అద్దింది. పార్టీ నాయకురాలు - ప్రసిద్ధ నటి - ఎమ్మెల్యే రోజా వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. రఘునాథపల్లి - స్టేషన్ ఘణ్ పూర్ - జఫర్ ఘడ్ మండల కేంద్రాల్లో రోడ్ షో నిర్వహించిన రోజా ప్రతిపక్షాలపై ముఖ్యంగా ఇరు రాష్ర్టాల సీఎంలు చంద్రబాబునాయుడు - చంద్రశేఖర్ రావులపై సెటైర్లు వదిలారు.
ఆంధ్రాలో చంద్రబాబునాయుడు మూటలతో గారడీ చేస్తుంటే... తెలంగాణలో కేసీఆర్ మాటలతో గారడీ చేస్తున్నారని రోజా విమర్శించారు. వైఎస్ ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ - టీఆర్ ఎస్ కు వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కొని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజలకు మచ్చతెచ్చారని ఆక్షేపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం అక్కడా.. ఇక్కడా పలుకరించిన పాపాన పోలేదని అదీ ఇద్దరు ముఖ్యమంత్రుల ఘతన అన్నారు. సంక్షేమ పాలన కోసం వైసీపీకి పట్టం కట్టాలని రోజా కోరారు.