లంచాల కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెడ్తున్న బాబు

Update: 2017-03-31 07:17 GMT
మొగ‌ల్తూరులోని ఫుడ్ పార్క్‌లో విష వాయువులు లీకై ఐదుగురు మ‌ర‌ణించిన దుర్ఘ‌ట‌నపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిప‌డ్డారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించేందుకు సిద్ధం కాక‌పోవ‌డం గ‌ర్హ‌నీయ‌మ‌న్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు రావడం లేదని అన్నారు. ఆక్వా ఘటనపై చర్చకు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే ప్రభుత్వం చర్చకు ముందుకు రాకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు సభలో నిరసన తెలిపారు. దీంతో స్పీకర్‌ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం మీడియా పాయింట్‌ లో ఎమ్మెల్యే రోజా ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

రాష్ట్ర  ముఖ్యమంత్రి తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల విష వాయువులు పీల్చి అమాయకులైన ఐదుమంది కార్మికులు మృత్యువాత పడ‌టం బాధాక‌ర‌మని రోజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `ఇటీవ‌ల రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోతే పరామర్శించరు. అగ్రిగోల్డులో 105 మంది ఆత్మహత్య చేసుకున్న చంద్రబాబు పట్టించుకోవడం లేదు.  ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చనిపోతే ఆయన చితి ఆరకముందే ఆయన కూతురు అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకొని వచ్చి చంద్రబాబు శవ రాజకీయాలు చేశారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎలా దిగజారిపోయారో గమనించాలి. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా పట్టించుకోకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.  నమ్మి ఓట్లు వేసిన వారికి న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు.  మీ కమీషన్ల కోసం మనషుల ప్రాణాలతో చెలగాటమాటం ఆడవద్దు. మీ లంచాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టాలని చూస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సహించడు. మిమ్మల్ని వదిలిపెట్టడు` అని రోజా స్ప‌ష్టం చేశారు.

ఆక్వా ఘటనపై చర్చ చేపట్టి తుంద్రురు, మొగల్తూరులో విష వాయువులను ఎదజిమ్మే ఇలాంటి ఫ్యాక్టరీలను అక్కడి నుంచి తరలించి అక్కడి ప్రజలను రక్షించాలని రోజా కోరారు. `మొగల్తూరు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలి. దేశమంతా ఒకే చట్టం అమలవుతుంది, మీకొక్కిరికే కొత్త చట్టం లేదు. చట్టప్రకారం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి.` అని రోజా డిమాండ్ చేశారు.  సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో కాసుల కళ్యాణ్‌ను రంగంలోకి దించి ఆ సమస్యను నీరుగార్చుతున్నారని రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌శ్నిస్తానన్న పవన్‌ కళ్యాణ్‌కు చిత్తశుద్ధి లేకపోవడం దౌర్భగ్యకరమైన విషయమ‌ని రోజా పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News