ట్రెండింగ్ లో దువ్వాడ దంపతులు.. అంతా ఆ వీడియో మయం!
తాజాగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడడంతో.. వీరి గురించి సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.;
దువ్వాడ శ్రీనివాస్ - మాధురి జంట గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్స్ గా అటు మీడియా.. ఇటు రాజకీయ.. వ్యాపార రంగాలలో మంచి పేరు దక్కించుకున్నారు. పైగా ఈమధ్య కాలంలో ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత మళ్లీ ప్రజల దృష్టిని ఆకర్షించింది ఈ జంట. వివాదాలు, సఖ్యతలు, సహాయాలు అంటూ తరచుగా మీడియాలో కనిపిస్తూ.. నిరంతరం వార్తల్లో నిలిచిన ఈ జంట.. తాజాగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడడంతో.. వీరి గురించి సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటి ఎదురుగా ఉన్న ది పెండెంట్ ఫామ్ హౌస్ లో దువ్వాడ మాధురి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే బర్తడే పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు నిలిపివేశారు. ఎందుకంటే వేడుకను జరుపుకోవడానికి పోలీసుల నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే పోలీసులు నిలిపివేసినట్లు సమాచారం. అంతేకాదు అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకొని దువ్వాడ మాధురి శ్రీనివాస్ పై కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాతనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరు.. తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
ఇంటర్వ్యూలో భాగంగా హైదరాబాదులోని పార్టీ కల్చర్ గురించి దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హైదరాబాదులో వీకెండ్ వచ్చిందంటే చాలు కొన్ని వేల సంఖ్యలో పార్టీలు, ఫంక్షన్లు జరుగుతాయి. వీటికి వీఐపీలు , వీవీఐపీలు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ రాని అభ్యంతరాలు మేము పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తేనే వస్తాయా? ఎందుకు ప్రతి విషయాన్ని మా విషయంలో వివాదాస్పద కోణంలోనే చూస్తున్నారు? అంటూ ఆయన ప్రశ్నించారు.
అక్రమ మద్యం తీసుకున్నట్లు వచ్చిన వార్తలలో వాస్తవం లేదని తెలిపిన ఆయన.. తనకు మందు, సిగరెట్ అలవాటు లేదని గతంలో చెప్పాడు. అయితే ఇప్పుడు మళ్లీ మాట్లాడుతూ.. రెండు మూడు నెలలకు ఒకసారి మంచి కంపెనీ లేదా ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు మాత్రమే సరదాగా ఒక పెగ్ వేస్తాను. బార్లకు , పబ్బులకు వెళ్లి మందు కొట్టే సంస్కృతి నాది కాదు. కేవలం ఇంట్లోనే చిల్ అవుట్ సెషన్స్ ఉంటాయి అంటూ తెలిపారు.
మాధురి మాట్లాడుతూ.." దువ్వాడ శ్రీనివాస్ కి కావాల్సినవన్నీ నేనే స్వయంగా చూసుకుంటాను. మద్యం తీసుకునేటప్పుడు దువ్వాడకు ఇష్టమైన స్టఫ్ పెప్పర్ చికెన్, కాజు ఫ్రై నేనే స్వయంగా వండి వడ్డిస్తాను. దువ్వాడ ఫ్రెండ్స్ లేదా ఆఫీస్ స్టాప్ వచ్చినప్పుడు కూడా నేనే స్వయంగా వంట వండి వడ్డిస్తాను అంటూ ఆమె తెలిపింది. మొత్తానికైతే తొలిసారి పబ్లిక్ లో పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఒక్క వీడియోతో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ జంట.