• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సర్వేలో జగన్ కు ఇచ్చిన...

సర్వేలో జగన్ కు ఇచ్చిన ర్యాంకుపై రోజా ఫైర్

By - Tupaki Desk
Update: 2022-07-14 09:08 GMT
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరించే అతికొద్ది మంది నేతల్లో ఆర్కే రోజా ఒకరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె టీడీపీ అధినేత చంద్రబాబును అదే పనిగా తిట్టి పోస్తుంటారు. నిజానికి తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ కెరీర్ షురూ చేసి.. ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ లోకి మారటం.. తర్వాతి కాలంలో వైఎస్ జగన్ కు.. ఆయన పార్టీకి వీర విధేయురాలిగా మారిపోటం తెలిసిందే. మహిలలకు ఉండే పరిమితుల్ని అస్సలు పట్టించుకోని రోజా.. రాజకీయ ప్రత్యర్థులపై ఎంతటి ఘాటు వ్యాఖ్యలు చేస్తారో తెలిసిందే.

తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వేళ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తనకు లభించిన అవకాశాన్ని ఏ మాత్రం వేస్టు కాకుండా చంద్రబాబు అండ్ కో మీద విరుచుకుపడ్డారు. ఇటీవల విడుదలై.. సంచలనంగా మారిన దేశ వ్యాప్త రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రజాదరణ ర్యాంకుల విషయంపై తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పది రోజుల ముందు ముఖ్యమంత్రి అయిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి టాప్ 5లో ఉంటే.. మూడేళ్లుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ కు అట్టడుగు ర్యాంకు ఇవ్వటం ఏమిటంటూ ఫైర్ అయ్యారు.

ఎన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఎన్ని పథకాలు అమలు చేస్తున్నారన్న దానితోనే కాకుండా ఇతర అంశాలు కూడా ప్రజాదరణకు సూచీలుగా ఉంటాయన్న విషయాన్ని మంత్రి రోజా మిస్ కావటం ఏమిటి? రాజకీయ ప్రత్యర్థుల తప్పుల్ని భూతద్దంలో వేసుకొని మరీ తిట్టి పోస్తారన్న పేరున్న రోజాకు..

సొంత ప్రభుత్వంలోని తప్పులు కనిపించకపోవటం తప్పేం కాదు. కాకుంటే.. ర్యాంకు ఇవ్వకపోవటానికి కారణం ఏమిటన్న దానిపై ఆత్మవిమర్శ కంటే కూడా.. పర నింద మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టటంపైనే అభ్యంతరమన్న మాట వినిపిస్తోంది.

తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చిన ప్రతిసారీ మిస్ కాకుండా ప్రస్తావించే చంద్రబాబు.. లోకేశ్ ల గురించి రోజా మాట్లాడారు. చంద్రబాబును అందరూ బోగస్ బాబుగా పిలుస్తున్నారన్నారు. బోగస్ సర్వేలు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు.. చంద్రబాబుకు.. నారా లోకేశ్ కు చిన్న మెదడు చిట్లిపోయిందన్నారు.

లోకేశ్ ను త్వరలో మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలంటూ తనకు అలవాటైన రీతిలో తిట్టిపోసేశారు. ఏమైనా.. ఏపీ రాజకీయాల్లో నోటి మాటలు హద్దులు మీరటానికి కారకులు ఎవరన్న జాబితా తయారు చేస్తే.. అందులో ఆర్కే రోజా పేరు తప్పనిసరిగా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.
Tags:    
  • Roja 
  • YSRCP 
  • Jaganmohanreddy 
  • Government 
  • Telugudeshamparty 
  • Chandrababunaidu 
  • Tirupathi 
  • Media 
  • Firebrand 
  • Naralokesh 
  • Politics 
  • Politicalnews 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS