కాంగ్రెస్ పప్పు..తెలుగు పప్పు..ఇక వీణ వాయించుకోవడమే!
రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందిద్దామని వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. పరిపాలన సమర్థం చేయలేని - రాజకీయాలకు చిరునామాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాలన మారిందన్నారు. చిత్తూరు నగరంలో పార్టీ కార్యాలయాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన రోజా మాట్లాడుతూ...తెలుగు పప్పు లోకేష్‌కు కాంగ్రెస్ పప్పు రాహుల్ తోడయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో కలిసిన రాహుల్ గాంధీ ఇక బాబు ఇచ్చిన వీణనే వాయించుకుంటూ కూర్చోవాల్సి వస్తుందని రోజా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదని - అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతకూడారని అన్నారు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలవకుండా చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారని రోజా దుయ్యబట్టారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్ అనే వ్యక్తిని లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని రోజా ఆరోపించారు. పలు కేసులున్న క్రిమినల్‌ని ఎలా ఎయిర్ పోర్టు రెస్టారెంట్ లో పెట్టుకున్నారని ప్రశ్నించారు. దాడి తర్వాత ప్రతిపక్ష నేత జగన్ పై టీడీపీ నేతలు ఎలా మాటల దాడి చేశారో ప్రజలు అందరూ చూశారని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగితే టీడీపీ నేతలు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని రోజా ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో వైసిపి నేతలు మరింత బాధ్యతగా కార్యకర్తలు - నాయకులు పనిచేయాలని ఆమె కోరారు.
పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లో కాంగ్రెస్ ను తిట్టారన్నారు. బీజేపీతో విడాకులు తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ తో జత కట్టి ధర్మ పోరాటం అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ధర్మపోరాట దీక్షలకు అయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి దుబారా చేయడం కాదా అని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు - నీరు - చెట్టు - రోడ్ల మరమ్మతులు - మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి తారాస్థాయిలో ఉందని విమర్శించారు. ఇంత అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు..ధర్మపోరాట దీక్ష గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా - లిక్కర్ మాఫియా - చంద్రన్న కానుకల్లో కల్తీ సరుకులు వస్తున్నాయని - ఇలా ప్రతిదానిలో అవినీతి కనపడుతున్నా ధర్మపోరాటాలంటూ బాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు.