'ఇండియన్ క్రికెటర్’ పదాన్ని తొలగించిన రోహిత్ శర్మ! ఇందులో వాస్తవ మెంతా?
ఓపెనర్, టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సోషల్ మీడియా బయో నుంచి ఇండియన్ క్రికెటర్ అనే పదాన్ని తొలగించారంటూ సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన న్యూస్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయనందువల్లే ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. గాయపడ్డ రోహిత్ ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ లకు దూరం అయ్యాడని అది దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు శర్మ ను ఎంపిక చేసి ఉండరని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రోహిత్ లో అసంతృప్తి ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన మూడు ఫార్మెట్లలోనూ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరు కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. గాయం కారణంగా అతడికి విశ్రాంతి ఇస్తున్నామని మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు రోహిత్‌ను పర్యవేక్షిస్తుందని బీసీసీఐ ప్రకటించింది. అంతే కాదు రోహిత్ ఐపీఎల్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో ఆడతాడా.? లేదా.? అనే సందిగ్దత నెలకొంది.ఈ పరిస్థితులు ఇలా ఉండగా రోహిత్ శర్మ తన సోషల్ మీడియా బయో నుంచి 'ఇండియన్ క్రికెటర్' అనే పదాన్ని తొలగించాడు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్‌గా మారింది. దీంతో అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.
రోహిత్ శర్మ పట్ల బీసీసీఐ వ్యవహరిస్తోన్న తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆస్ట్రేలియా సిరీస్ కు ప్రకటించిన జట్టులో రోహిత్‌కు స్థానం దక్కకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు మ్యాచ్‌లు గాయం కారణంగా దూరమైన మయాంక్ అగర్వాల్‌ను మూడు ఫార్మాట్లకు ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ రోహిత్‌కు ఎందుకు స్థానం కల్పించలేదంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ తన బయో నుంచి ఇండియన్ క్రికెటర్ అనే పదాన్ని తొలగించాడంటూ న్యూస్ వస్తుండటంతో ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. అయితే రోహిత్ సెలక్షన్ తీరుపై అసంతృప్తితోనే ఇలా వ్యవహరించాడా అనే దానిపై నిజా నిజాలు తెలియడం లేదు. రోహిత్ శర్మలో అసంతృప్తి ఏమీ లేదని.. మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.