• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజీవ్ ఖేల్‌ రత్న...

రాజీవ్ ఖేల్‌ రత్న అవార్డుకు హిట్ మ్యాన్ నామినేట్‌ !

By - Tupaki Desk
Update: 2020-08-18 13:11 GMT
క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ , ఓపెనర్ , హిట్ ‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ పేరును క్రీడా మంత్రిత్వశాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. రోహిత్ తో పాటుగా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్‌ మరియప్పన్‌ తంగవేలు పేర్లను రాజీవ్ ఖేల్‌ రత్న పురస్కారానికి సిఫార్సు చేశారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 మంది సెలక్షన్‌ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మక అవార్డుకు వీరిని నామినేట్‌. అయితే, ఈ పురష్కారాలకి ఒకేసారి నలుగురు నామినేట్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2016లో ఒకసారి న‌లుగురు క్రీడాకారులని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు.

2019 ఏడాదిలో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ‌లో మెరుపులు మెరిపించి , ఆ సీజ‌న్‌లో వ‌న్డేల్లో ఏడు సెంచ‌రీలతో మొత్తం 1490 ర‌న్స్ చేశాడు. కాగా 2019 ఏడాది క్రికెట్‌ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నేపథ్యంలో రోహిత్‌ శర్మను ప్రతిష్టాతక్మ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కమిటీలో సభ్యుడైన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తెలిపారు. ఇక , 2018లో జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌, ఎషియన్‌ గేమ్స్ ‌లో బంగారు పతకాలు, 2019 ఏసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్ ‌షిప్ ‌లో క్యాంస్య పతకం సాధించి వినేశ్ ఫోగట్‌ చరిత్ర సృష్టించారు.

మరియప్పన్‌ తంగవేలు.. 2016లో రియో పారాఒలింపిక్స్‌లో టి42 హై జంప్‌ కేటగిరి విభాగంలో బంగారు పతకం సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పాడు.

టేబుల్‌ టెన్నిస్‌ సంచలనంగా పేరు పొందిన మనిక బాత్రా 2018 నుంచి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.

ఇకపోతే , ఇండియన్‌ క్రికెట్ ‌లో రోహిత్‌ శర్మ కంటే ముందు ముగ్గురు మాత్రమే ఈ ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ‌గాంధీ ఖేల్‌ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో సచిన్‌ టెండూల్కర్‌( 1998), ఎంఎస్‌ ధోని(2007), ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(2018)లో ఎంపికయ్యారు.
Tags:    
  • Rohit Sharma 
  • Rajiv Khel Ratna Award 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS