• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా ఇన్ఫెక్షన్లు ఆరు...

కరోనా ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే తస్మాత్ జాగ్రత్త !

By - Tupaki Desk
Update: 2020-08-07 00:30 GMT
ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా కారణంగా భయంతో వణికిపోతోంది. రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అసలు ఈ కరోనా మహమ్మారి ఎలా సోకుతుందో, ఎవరికి సోకుతుందో అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు బయటపడితే, మరికొందరు మధ్యస్థ లక్షణాలుతో బాధపడుతున్నారు. ఇంకొందరిలో అయితే అసలు లక్షణాలే కనిపించట్లేదు. దీనితో కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే లండన్ ‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనా ఇన్ఫెక్షన్లు ఆరు రకాలుగా ఉన్నాయని కనుగొన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో మొదటి వారంలో ఉన్న లక్షణాల ద్వారా వైరస్ తీవ్రత ఎంత ఉంటుందో చెప్పగలమని, మార్చి- ఏప్రిల్ మధ్యకాలంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన 1600 మంది కరోనా రోగులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మొదటి 8-10 రోజుల్లో వారు అనుభవించిన లక్షణాల వివరాలను వెల్లడించమని కోరారు. మూడు క్లస్టర్లు గల అంటువ్యాధులు స్వల్ప లక్షణాలు ఉన్న రోగుల్లో.. మరో మూడు క్లస్టర్లు మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగుల్లో ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు.

1. జ్వరం లేకుండా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్:
వైరస్ సంక్రమణలో ఇది తేలికపాటి రూపం కాగా.. ఈ ఇన్ఫెక్షన్ నుంచి బాధపడేవారిలో జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ఛాతీ నొప్పి, కండరాల నొప్పి, వాసన కోల్పోవడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సంక్రమణ దశలో మాత్రం జ్వరం ఉండదు.

2. జ్వరంతో కూడిన ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్:
ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులు తేలికపాటి ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే జ్వరం కూడా ఉంటుంది. ఆకలి తగ్గడం, పొడి దగ్గు, గొంతుక మొద్దుబారడం వంటివి కూడా ఉంటాయి.

3. జీర్ణశయాంతర సంక్రమణ:
ఈ క్లస్టర్‌ కు చెందిన రోగులు వారి జీర్ణక్రియను ప్రభావితం చేసే లక్షణాలతో బాధపడతారు. దగ్గు, వికారం, ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, ఛాతీ నొప్పి స్వల్పంగా ఉంటుంది.

4. తీవ్ర ఇన్ఫెక్షన్, నీరసం ఉంటుంది:
ఈ క్లస్టర్‌ లో రోగులు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ తో బాధపడతారు. వారికి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అలసట కలుగుతుంది. ఇక కరోనా సంక్రమణ అధికంగా ఉంది అనడానికి ఇదొక హెచ్చరిక లాంటిది. అలసట, తలనొప్పి, వాసన, రుచి కోల్పోవడం, గొంతు నొప్పి, జ్వరం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలతో రోగులు బాధపడతారు.

5. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో పాటు నాడీ వ్యవస్థపై ప్రభావం:
ఈ క్లస్టర్‌ లోని రోగులు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ తో బాధపడటమే కాకుండా వారి నాడీ వ్యవస్థపై కోవిడ్ తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తలనొప్పి, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, దగ్గు, జ్వరం, గొంతుక మొద్దుబారడం, స్థిమితంగా ఉండలేకపోవడం, ఛాతీ నొప్పి, అలసట, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

6. క్లస్టర్ ..
మొదటి వారంలో కొంతమంది రోగుల్లో కనిపించే అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ ఇదే. నాడీ వ్యవస్థపై ప్రభావం, గొంతు నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, విరేచనాలు, శ్వాశకోశ సమస్యలు, కండరాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ క్లస్టర్‌ కు చెందిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంది. వెంటిలేషన్, ఆక్సిజన్ కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది.
Tags:    
  • researchers 
  • six types of viruses 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS