‘స్వర్ణ’ ప్రమాదంపై నివేదిక... ‘రమేశ్’దంతా దందానే
విజయవాడ, గుంటూరు కేంద్రంగా వైద్య సేవలందిస్తున్న రమేశ్ ఆసుపత్రి ఎలాంటి దందా నిర్వహిస్తోందన్న విషయం స్వర్ణ పాలెస్ ప్రమాదంలో ఇట్టే బట్టబయలైపోయింది. రమేశ్ ఆసుపత్రి విజయవాడలోని స్వర్ణ పాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా... కరోనా చికిత్స కోసం అందులో చేరిన వారిలో 10 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను కలకలం రేగగా... ఘటనపై పూర్తి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు... అందుకోసం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ప్రమాదం జరిగిన స్వర్ణ పాలెస్ తో పాటు రమేశ్ ఆసుపత్రి లోనూ తనిఖీలు చేసింది. ఆ వివరాలతో జిల్లా కలెక్టర్ కు ఓ నివేదిక సమర్పించింది.
ఈ నివేదికను ఆధారం చేసుకుని రమేశ్ ఆసుపత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ కోసం రమేశ్ ఆసుపత్రికి ఇచ్చిన కేటగిరీ-ఏ అనుమతులను రద్దు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. అంతే కాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కూడా కలెక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జేసీ ఆధ్వర్యంలోని కమిటీ... రమేశ్ ఆసుపత్రి వ్యవహరిస్తున్న తీరుపై సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ నియమ నిబంధనలను ఎంతమాత్రం పట్టించుకోకుండా రమేశ్ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోందని సదరు కమిటీ నిగ్గు తేల్చింది. హోటల్ నిర్వహణలో ఆసుపత్రి యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని కమిటీ తేల్చింది. అంతేకాదు.. జీవో 77ను అతిక్రమించి ఆసుపత్రి యాజమాన్యం ఫీజులను భారీగా వసూలు చేశారని తేటతెల్లమైంది.
ఇక ఈ నివేదికలో రమేశ్ ఆసుపత్రి భండారాన్ని కమిటీ బట్టబయలు చేసింది. ఆ నివేదికలో కమిటీ ఏమని పేర్కొన్నదన్న విషయానికి వస్తే...‘ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నంబర్-77ను అతిక్రమించి రమేశ్ ఆసుపత్రి కోవిడ్ బాధితుల నుంచి అధికంగా ఫీజులను వసూలు చేసింది. రూల్-9 ఏపీ అల్లోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ రిజిస్ర్టేషన్, రెగ్యులేషన్ రూల్స్‌ను రమేష్ హాస్పిటల్ పట్టించుకోలేదు. ఆసుపత్రి రిసెప్షన్‌లో అందిస్తున్న సేవల రేటు ఇంగ్లీష్‌లోనూ, తెలుగులోనూ ప్రదర్శించాలి. అలాంటి బోర్డును ఏదీ ఆసుపత్రి వద్ద ప్రదర్శించలేదు. మెట్రో పాలిటన్ హోటల్, ఎం- 5 హోటల్ లో జిల్లా అధికారుల అనుమతి లేకుండా కోవిడ్ కేసులను జాయిన్ చేసుకుంది’’ అని కమిటీ నిగ్గు తేల్చింది. ఇక ఈ నివేదిక ఆధారంగానే డిఎంహెచ్‌వో క్యాంపు ఆఫీస్ వద్ద ఈ నెల 30లోపు కమిటీ గుర్తించిన అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రమేశ్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను విచారణకు వచ్చే ముందు లేదా అదే రోజు తీసుకువచ్చి, స్వాదీన పరచాలి’ అని కమిటీ ఆదేశించింది.