వైసీపీలో రెడ్లు వెనుక బెంచ్ యేనా?

Update: 2020-08-18 09:30 GMT
ఏపీలో ప్రధానంగా మూడు అగ్రకులాలే రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నాయి. టీడీపీ తరుఫున కమ్మలు.. వైసీపీ తరుఫున రెడ్లు, బీజేపీ, జనసేన తరుఫున కాపులు బరిలో ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మల అధిపత్యం కొనసాగుతోంది. అన్నింట్లోనూ వారే ఉంటారు. వ్యాపారాలు బాగానే చేసుకుంటారు.

అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్లు భారీగా ఆశలు పెంచుకున్నారు. వైసీపీ అంటే రెడ్డి పార్టీ అని కలలుగన్నారు.కానీ ఇప్పుడు వైసీపీ అంటే రెడ్డి పార్టీ అన్నారో మీరు పప్పులో కాలువేసినట్లే.. ఎందుకంటే ఈరోజు  టీడీపీ విమర్శించినట్లు సీఎంవో ఆఫీసులో రెడ్లు మొత్తం కాకుండా కొంతమంది మాత్రమే ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ లో కమ్మ లాబీయింగ్ నడిచేది. కానీ వైసీపీలో అలా రెడ్ల ఆధిపత్యం అంతగా నడవడం లేదు.

అయితే రెడ్ల రాజ్యం ఏపీలో నడుస్తున్నా సామాన్య రెడ్లకు ఏమీ జరగడం లేదన్న ఆవేదన గ్రామాల్లో వ్యక్తమవుతోంది. దాదాపు 50మంది రెడ్డి ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు.  నలుగురు మంత్రులు.. రెండూ మూడు కార్పొరేషన్లు - సీఎంవో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ లో రెడ్లు ఉన్నారు. అయినా కూడా వైసీపీ సర్కారులో పేద రెడ్డిలకు ఏ పథకాలు అందడం లేదన్న ఆవేదన ఉంది.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కులం ప్రాంతం అని చూడకుండా పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాడు. కానీ ఇప్పుడు ఇంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నా పేద రెడ్డిలకు సంక్షేమ పథకాలు అందడం లేదని గ్రామాల్లో ఆ వర్గం వారు బాధపడుతున్నారు.
 
పథకాల్లో రిజర్వేషన్ - మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్ - పథకాలన్నీ కులాల పరంగా వైసీపీ సర్కార్ విభజించేసింది.  కానీ రెడ్ల కోసం ఏమీ చేయలేకపోయింది. రెడ్లను పక్కన పెట్టడానికే ఇదంతా చేశారని పేద రెడ్లు వాపోతున్నారు.
 
2019 ఎన్నికల్లో 8శాతం ఉన్న రెడ్లు.. 6.5 జిల్లాల్లో గంపగుత్తగా 98శాతం వైసీపీకి ఓట్లు వేశారు. వైసీపీ వస్తే రెడ్ల రాజ్యం వస్తుందనే టీడీపీ ఆరోపణలకు భయపడి రెడ్లకు జగన్ కోత పెట్టడం ఏందని పేద రెడ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద రెడ్లలో తాళిబొట్టు కూడా లేని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వలస కూలీలు ఉన్నారు. పెళ్లి చేయలేక సతమతం అవుతున్న వారున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం వారందరికీ పథకాలు అందడం లేదని రెడ్లు అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఇదే విషయం రెడ్డి సంఘాల్లో తీవ్ర చర్చకు దారిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదన వారిని పట్టిపీడిస్తోందట..
Tags:    

Similar News