రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ కులాలు వైసీపీకి దూరం అవుతున్నాయా?
ఏపీలో సీఎం జగన్ క్లీన్ స్వీప్ చేసేశాడు. అటు అసెంబ్లీ ఎన్నికలైనా.. ఇటు పంచాయతీ, మున్సిపోల్స్ అయినా సరే జగన్ ను కొట్టేవాడే లేకుండా పోయాడన్న చర్చ సాగుతోంది. అంతలా ప్రజలు ఆయనకు పట్టం కట్టేశారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేశారు.
అందుకే గద్దెనెక్కగానే తన సొంత సామాజికవర్గమైన రెడ్డిలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సామాజిక కోణంలో బడుగు బలహీన, అణగారిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చి సీనియర్లు, బలమైన రెడ్డి, కమ్మ నేతలను సైతం జగన్ పక్కనపెట్టి అందరికీ షాకిచ్చాడు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీల్లో జగన్ హీరోగా మారిపోతున్నాడు. వారికోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు పెట్టి చేరువ అవుతున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ అండగా నిలిచిన అగ్రకులాల వారికి మాత్రం ఏమీ చేయడం లేదన్న నిరాశ నిసృహ వారిలో వ్యక్తమవుతోందట.. ఈ మేరకు ఆయా వర్గాల్లో అసంతృప్తి రాజ్యమేలుతోందన్న ప్రచారం సాగుతోంది.
తమ సొంత సామాజికవర్గం నుంచి జగన్ సీఎం అయ్యాడని రెడ్డి కులస్థులు మొదట్లో సంతోషించారట.. కానీ ఇపుడు వారిలో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగడం లేదని వారంతా తలలు పట్టుకుంటున్నారు. అగ్ర కులాల రిజర్వేషన్లను కూడా జగన్ అడ్డుకోవడం మంచిది కాదని రెడ్డి సామాజికవర్గం గుస్సా అవుతోందట.
ఇక చంద్రబాబు పాలనలో బలంగా తయారైన కమ్మలు సైతం వైసీపీకి సపోర్టుగా పోయినసారి నిలబడ్డారు. కానీ వారికి ఇప్పుడు న్యాయం జరగడం లేదని ఘోషిస్తున్నారట.. బ్రాహ్మణులు, ఇతర అగ్ర కులాల వారు కూడా వైసీపీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. కులాల మధ్య పోరాటం రేగితే జగన్ కి అతి పెద్ద ఇరకాటమే అవుతుందని వారంతా స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంతో బీసీలంతా మళ్లీ వైసీపీకి దూరం అయితే జగన్ కి రాజకీయంగా అది తీరని నష్టమని వైసీపీలో చర్చ సాగుతోంది.
మొత్తానికి ఇన్నాళ్లు జగన్ కు అండగా నిలిచిన ఓసీలు ఉద్యమం చేస్తే మాత్రం ఏపీలో కులాల మధ్య సంకుల సమరానికి దారితీయవచ్చు అంటున్నారు. బీసీలకు పెద్దపీట వేస్తూ అగ్రకులాల్లోని పేదలను పట్టించుకోని.. వారి సంక్షేమాన్ని వదిలేసిన జగన్ రెంటికి చెడ్డ రేవడిలా తయారు అవుతానడి హెచ్చరిస్తున్నారు. అందరి బాగోగులు చూడాలని కోరుతున్నారు. మరి దీనికి పరిష్కారాన్ని జగన్ ఏం సూచిస్తారో చూడాలి.