అజిత్ పవార్ విమాన ప్రమాదం.. పైలట్ మరణం పై ఫ్రెండ్స్ షాకింగ్ వ్యాఖ్యలు!

అవును... బారామతిలో బుధవారం ఉదయం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ప్రమాదానికి గురవ్వడంతో ఆయనతో సహా ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే.;

Update: 2026-01-30 07:20 GMT

వేదాంతం అనుకోకపోతే... సాధారణంగా చావు, పుట్టుకలు మనిషి చేతుల్లో ఉండవని అంటారు! వర్షం రాక, ప్రాణం పోక ఎవరూ చెప్పలేరని గ్రామాల్లో పెద్దలు చెబుతుంటారు! రాసి ఉంటే మరణాన్ని ఎవరూ తప్పించలేరని ఇంకొందరంటే... రాసి ఉంటే ఆ రాతను మార్చలేరని చెబుతుంటారు! ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరైన కెప్టెన్ సుమిత్ కపూర్ అసలు ఆ విమానంలో ప్రయాణించాల్సింది కాదంటూ ఆయన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తూ చెబుతున్నారు!

అవును... బారామతిలో బుధవారం ఉదయం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ప్రమాదానికి గురవ్వడంతో ఆయనతో సహా ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో కెప్టెన్ సుమిత్ కపూర్ ఒకరు. అయితే.. అతను ఆ విమానాన్ని నడపాల్సింది కాదని.. టేకాఫ్ కు కొన్ని గంటల ముందే అతనికి పిలుపు వచ్చిందని.. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటికప్పుడు అతను విధులకు వెళ్లారని.. ఇంతలోనే ఇలా జరిగిపోయిందని.. అతడు ఇలాంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడని తాము అస్సలు ఊహించలేదని ఆయన స్నేహితులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందిస్తూ.. అజిత్ పవార్ విమానం నడపాల్సిన పైలట్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారని.. దీంతో టేకాఫ్ కు కొన్ని గంటల ముందే సుమిత్ కు పిలుపొచ్చిందని.. అతడు కొన్ని రోజుల కిందటే హాంకాంగ్ నుంచి వచ్చాడని తెలిపారు. అయితే.. పైలట్ తప్పిందం వల్లే ప్రమాదం జరిగిందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయని.. కానీ, సుమిత్ అలాంటి పొరపాట్లు చేస్తాడని తాము అనుకోవట్లేదని.. అతడికి విమానం నడపడంలో అపార అనుభవం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా.. సమగ్ర దర్యాప్తును కోరుతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన సుమిత్ స్నేహితుడు సచిన్ తనేజా... అతడు ధరించిన బ్రాస్లైట్ ద్వారా అతని మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ఇదే సమయంలో... ఈ ప్రమాదం గురించి విన్నప్పుడు కపూర్ చనిపోయాడని తాము ఎవరమూ నమ్మలేదని మరో స్నేహితుడు నరేష్ తనేజా అన్నారు. ఇదే సమయంలో జీఎస్ గ్రోవర్ మాట్లాడుతూ... కపూర్ హాంకాంగ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనతో చాలా సేపు మాట్లాడాడని తెలిపారు. ఇది తమకు ఊహించని భారీ షాక్ అని అన్నారు!

కాగా.. కెనడాలో అధునాతన శిక్షణ తీసుకున్న సుమిత్ కపూర్ (62) సహారా ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ వంటి సంస్థల్లో పనిచేశారు. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా వీ.ఎస్.ఆర్. ఏవియేషన్ సంస్థలో పనిచేస్తున్నారు. సుమారు 15వేల గంటలకు పైగా విమాన అనుభవం ఉన్న సుమిత్ కు కుమారుడు, కుమార్తె ఉండగా.. వీరిద్దరూ వివాహితులు. ఈ క్రమంలో కుమారుడితో పాటు అల్లుడు కూడా పైలట్ కావడం గమనార్హం.

Tags:    

Similar News