తెలుగు రాష్ట్రాలు పట్టించుకోని ‘మల్లి’కి అరుదైన గౌరవాన్ని ఇచ్చిన ఆ రాష్ట్రం

Update: 2021-06-23 05:30 GMT
రంగం ఏదైనా కావొచ్చు.. టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ తెలుగోడిగా పుడితే అంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రముఖులు ఎవరిని చూసినా వారికున్న టాలెంట్ కు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో వారు కానీ పుట్టి ఉంటే వారికి లభించే పేరు ప్రఖ్యాతులు మరోలా ఉండేవని చెబుతారు. తాజాగా మరోసారి ఇదే విషయం ఫ్రూవ్ అయ్యింది.

వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం.. ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భాతర మహిళ.. తెలుగింటి ముద్దుబిడ్డ కరణం మల్లీశ్వరి. ఆమెకున్న టాలెంట్ తో.. దేశానికి పనికి వచ్చే క్రీడారత్నాల్నితయారు చేసే వీలుంది.లక్షల కోట్లు పెట్టి బడ్జెట్ లు పెట్టే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. అలాంటి వారిని ఎంకరేజ్ చేసి.. క్రీడల్లో తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నతెలుగు సామెతకు తీసిపోనట్లుగా పాలకుల తీరు ఉంటుంది.

తాజాగా కరణం మల్లీశ్వరిని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఆమెను ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా నియమిస్తూ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగ్గట్లే ఢిల్లీ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పదేళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్.. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కనీసం యాభై పతకాల్ని సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.

దీన్ని ఢిల్లీ జిల్లాలోని ముండ్కా పట్టణంలో నిర్వహిస్తున్నారు. దేశంలోని తొలి క్రీడా యూనివర్సిటీని కేజ్రీవాల్ సర్కార్ నిర్మిస్తోంది.దీనికి వీసీగా మనమ్మాయ్ కరణం మల్లీశ్వరిని ఎంపిక చేశారు.ఈ వర్సిటీ ప్రత్యేకత ఏమంటే.. క్రీడాకారులు ఏ ఆటలో అయితే తాము రాణించాలని ఆశిస్తారో.. అందులో డిగ్రీ చేసేలా విద్యా వ్యవస్థను రూపొందిస్తున్నారు. అంటే క్రికెటర్ క్రికెట్ లో.. బాక్సర్ బాక్సింగ్ లో డిగ్రీ చేసే వీలుంది. శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. 1997లో తన సహచర వెయిట్ లిఫ్టర్ హర్యానాకు చెందిన రాజేశ్ త్యాగిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడింది. తాజాగా ఆమెకు అనూహ్యమైన గుర్తించి.. అరుదైన గౌరవాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పాలి.


Tags:    

Similar News