• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చెన్నై వరదల గుట్టు...

చెన్నై వరదల గుట్టు విప్పేశారు

By - Tupaki Desk
Update: 2016-01-01 06:34 GMT
లక్షలాది మంది చెన్నై వాసులకు పీడకలగా మారి.. తమ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంత చేదు గురుతుల్ని మిగిల్చిన వరదల గుట్టు తేల్చారు. ఇంత భారీగా వరదలు పోటెత్తటానికి కారణం 2015లో ఏర్పడిన అతి శక్తివంతమైన ఎల్ నినోగా తేల్చారు. భారీ వర్షాలు కారణంగా పెద్ద ఎత్తున వర్షపు నీరు జమ కావటం.. అవి వెళ్లే మార్గాలు అక్రమ కట్టడాల కారణంగా వెళ్లలేక.. నీరు నిలిచిపోవటంతో.. లక్షలాది మంది ప్రజలు నానా యాతన పడాల్సి వచ్చింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది.

ఆధునిక భారతంలో ఒక ప్రకృతి విపత్తు.. అందునా భారీ వర్షాల కారణంగా ఒకేసారి 400కు పైగా ప్రజలు మరణించటం లేదనే చెప్పాలి. అలాంటి దురదృష్టకర పరిస్థితులతో పాటు.. చెన్నైలోని ప్రతిఒక్కరి మీదా ఆర్థిక భారాన్ని మిగిల్చిన ఈ భారీ వర్షాలకు అసలుసిసలు కారణం ఎల్ నినోగా తేల్చారు. ఫ్రాన్స్ కు చెందిన వాతావరణ కేంద్రం చేసిన అధ్యయనం ఈ విషయాల్ని వెల్లడించింది.

చెన్నైలోని భారీ వర్షంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఎదురైన వాతావరణ విపత్తులకు కారణం ఎల్ నినోగా తేల్చారు. కొన్ని చోట్ల భయంకరమైన ఎండ.. దీంతో వర్షం జాడ లేకుండా పోవటంతో కరవు రక్కసి జూలు విదల్చటం చేస్తే.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలతో ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి. అంతేకాదు.. 2015 సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా కూడా తేల్చారు.

ఎల్ నినో గురించి ఏడాది ముందే అంచనా వేసినా..  అది ఇంత పెద్ద స్థాయిలో ప్రభావం చూపిస్తుందని మాత్రం అనుకోలేదు. దీని తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే.. ఓపక్క వర్షాలు లేక.. ఎండలతో చెమటలు పట్టిస్తుంటే.. మరోవైపు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లేహ్ ప్రాంతంలో మైనస్ 16.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఎముకలు కొరికేసే చలితో జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలా.. ఓవైపు ఎండ.. మరోవైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు తీవ్రమైన చలితో ప్రజల్ని చంపేసే పరిస్థితులు నెలకొన్నాయి. మనిషి చేసిన తప్పులు.. అదే మనిషిని ఎంతగా వేధిస్తున్నాయో కదూ.
Tags:    
  • Chennai 
  • Chennai Floods 
  • Telugu NEWs 

Similar News

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

Copyright @2026

Powered by Blink CMS