కొత్త జిల్లాల ఏర్పాటు ఖర్చును తగ్గించేందుకు జగన్ ప్లానింగ్
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలు చేసేందుకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తరచూ ప్రయత్నిస్తుంటారు. సవాళ్లను ఎదుర్కోవాలే తప్పించి.. వాటిని చూసి వెనక్కి తగ్గి ఇచ్చిన మాట అమలు కాకుండా ఉండటాన్ని ఆయన ఇష్టపడరు. తాము అధికారంలోకి వస్తే.. ప్రతి లోక్ సభ స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వటం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు అయ్యే ఖర్చు విషయంపై ప్రభుత్వ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. దీని ప్రకారం రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీ ఖర్చు భారంగా మారుతుంది. అలా అని.. కొత్త జిల్లాల ఏర్పాటు హామీ అమలును ఆలస్యం చేయకుండా ఉండటానికి జగన్ మార్కు ప్లానింగ్ సిద్ధమైందని చెబుతున్నారు.
అధికారాన్ని వీలైనంత ఎక్కువగా వీకేంద్రీకరించటం ద్వారా.. జిల్లాల డెవలప్ మెంట్ ను పరుగులు తీయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానే అయితే 25.. లేదంటే 26 జిల్లాల్నిఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జగన్ ఉండటం తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కోత పెట్టేందుకు వీలుగా కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా ప్లాన్ చేశారు. కొత్త భవనాల నిర్మాణాన్ని పక్కన పెట్టేయటం.. ప్రస్తుతానికి అద్దె భవనాల్లో ఏర్పాట్లు చేయటంతో పాటు.. అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ చెప్పినట్లుగా తెలిసింది. ఓవైపు ఆర్థిక ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకుంటూనే.. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ త్వరగా జరగాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.