ప్రముఖ నటి చిత్ర ఆత్మహత్యపై ఆర్డీవో ప్రకటన

Update: 2021-01-01 07:43 GMT
టీవీ సీరియల్ నటి ‘ముల్లై’ చిత్ర ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. చిత్ర ఆత్మహత్యకు వేధింపులే కారణం కాదని  సంచలన విషయం తెలిసింది. తాజాగా శ్రీపెరుంబుదూరు ఆర్డీవో  దివ్యశ్రీ సంచలన విషయాలు బయటపెట్టారు.

నటి చిత్రకు, హేమనాథ్ అనే యువకుడితో పెళ్లి నిశ్చితార్థం జరిగిందని ఆర్డీవో వివరించారు. వీరి వివాహం జనవరిలో జరగాల్సి ఉండగా.. ఇరువురు కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్టోబర్ 19న రిజిస్ట్రర్ మ్యారేజీ చేసుకున్నారని వివరించారు.

ఆ తర్వాత పూందమల్లి సమీపంలోని ఈవీపీ ఫిలిం సిటీలో సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న చిత్ర నజరత్ పేటలోని హోటల్ లో బస చేశారన్నారు. ఆమెతోపాటు భర్త హేమనాథ్ కూడా హోటల్ లో ఉన్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో తొమ్మిదో తేది ఉదయం చిత్ర హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

రిజిస్ట్రర్ మేరేజి చేసుకున్న రెండు నెలలకే చిత్ర మృతి చెందడంతో ఆర్డీవో దివ్యశ్రీ విచారణ చేపట్టారు. ఈ నివేదికను ఆర్డీవో పోలీస్ కమిషనర్ కు సమర్పించారు. ఆ నివేదికలో చిత్ర వరకట్న  వేధింపులకు గురికాలేదని ప్రకటించినట్టు ఆర్డీవో దివ్యశ్రీ తెలిపారు. చిత్ర ఆత్మహత్యకు కారణమని ఆమె భర్త హేమనాథ్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు.
Tags:    

Similar News