• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హిందీ మాట్లాడే ఏకైక...

హిందీ మాట్లాడే ఏకైక హ్యుమనాయిడ్ రోబో!

By - Tupaki Desk
Update: 2018-08-05 10:18 GMT
హ్యూమనాయిడ్‌ రోబో సోఫియాకు చెల్లెలు దొరికింది. దీని పేరు రష్మీ. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన 38ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రంజిత్‌ శ్రీవాత్సవ ఈమెను సృష్టించాడు. హాంకాంగ్‌ సంస్థకు చెందిన ప్రత్యేక సాప్ట్‌ వేర్‌ సహాయంతో దీన్ని తయారు చేశారు. రెండేళ్ల కిందట ప్రారంభించిన ప్రాజెక్టు తుదిదశకు చేరింది. 30 రోజుల్లోనే తల - ముఖం అమరిక పూర్తిచేశానని రంజిత్ చెప్తున్నారు. మిగతా శరీర అవయవాలను త్వరలోనే బిగిస్తామని తెలిపారు.
   
ప్రపంచంలో హిందీ మాట్లాడే ఈ ఏకైక రోబో - ఇంగ్లీషుతోపాటు - భారతీయ భాషలైన భోజ్‌ పురి - మరాఠీ కూడా మాట్లాడగలదు. ఇప్పటి వరకు దీని తయారీకి 50వేల రూపాయలు ఖర్చయినట్లు అతను తెలిపాడు. 15 ఏళ్ల కిందట మదిలో మెదిలిన ఆలోచన ఇది. 2016లో ఈ హ్యుమనాయిడ్‌ రోబోకు శ్రీకారం చుట్టాను. ఇందుకు హాంగ్‌ కాంగ్‌ కు చెందిన సాఫ్ట్‌ వేర్‌ ను ఉపయోగించాను. భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ము ఖ్యంగా ఒంటరి తనంతో కుమిలిపోయే వాళ్లకు మంచి స్నేహితులుగా ఈ రోబోలు చేరువవుతాయంటున్నారాయన.        
   
ఇందులో అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా ఎదుటి వ్యక్తి ముఖాన్ని స్కాన్‌ చేసి గుర్తు పెట్టుకుంటుంది. కళ్లు - పెదాలు - కనుబొమ్మలను కదిలిస్తూ ఇది మాట్లాడగలదు. ఇందులో లింగ్విస్టిక్‌ ఇంటర్‌ ప్రిటేషన్‌  - కృతిమమేధ  - విజువల్‌ డేటా - ఫేసియల్‌ రికగ్నిషన్ వ్యవస్థలున్నాయి. ఏకబిగిన నాలుగు గంటలు మాట్లాడగలదు అని రంజిత్ వివరించాడు. ఎవరైనా ప్రశంసిస్తే థ్యాంక్స్‌ చెబుతుంది. చిరాకు కలిగిస్తే - బాధిస్తే మాత్రం గో టు హెల్‌ అంటూ కసురుకుంటుంది. సోఫియా - రష్మి ఇద్దరూ బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ అభిమానులే కావడం విశేషం. భవిష్యత్‌ లో రిసెప్షనిస్టులు - హెల్పర్లు ఉద్యోగాల్లో రోబోలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందంటున్నాడు రంజిత్.
Tags:    
  • Ranchi Man 
  • First Hindi Speaking Humanoid Robot 
  • Rashmi 

Similar News

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

ఉత్తరాదికి అందలం.. దక్షిణాదికి మొండిచేయి.. అభివృద్ధి అంటే భవనాలు కట్టడమేనా మోదీజీ?

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

గ్యారెంటీ లేని జడ్పీ పీఠం.. చిన్న శ్రీను కూతురు సిరి సహస్రకు బీసీ గండం?

2026-11-20 17:22 GMT

పవన్ ఇంటి వద్ద హైడ్రామా.. అప్పులు తీర్చాలని అభిమాని ఆత్మహత్యాయత్నం!

2026-11-20 17:18 GMT

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

Copyright @2026

Powered by Blink CMS