దూరదర్శన్ లో మళ్లీ రామాయణం పునః ప్రసారం !

Update: 2020-03-27 17:00 GMT
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ విధించడంతో ..దేశ ప్రజలందరు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార‌స‌మాచార శాఖ‌.. మ‌రోసారి రామ‌య‌ణం సీరియ‌ల్‌ను దూర‌ద‌ర్శ‌న్‌ లో ప్ర‌సారం చేయాల‌ని భావిస్తున్న‌ది. దూరదర్శన్ ఛానల్ లో గత  30  ఏళ్ల క్రితం ప్రసారమై దేశాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన ఈ  రామాయణ్ సీరియల్  మరోసారి దూరదర్శన్ పునః ప్రసారం కాబోతుంది.

ఈ సీరియల్ ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్ సాగర్ దర్శకత్వంలో   1987-88 మధ్య కాలంలో ప్రసారం అయ్యింది.  ఈ సీరియల్ లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లహరి, హనుమంతునిగా దారాసింగ్‌ తదితరులు నటించారు. ఈ సీరియల్ ఎంతగా ఫెమస్ అయ్యింది అంటే ..అప్పట్లో రాముడిగా నటించిన అరుణ్‌గోవిల్‌ అప్పట్లో ఎక్కడకు వెళ్లినా రాముడే వచ్చాడని ప్రజలు భారీ సంఖ్యలో ఆయన్ను చూసేందుకు వచ్చేవారు. అలాగే రామాయణ్ సీరియల్ ప్రసారమయ్యే ఆదివారాల్లో రోడ్లపై జనం లేకుండా నిర్మానుష్యంగా ఉండేవి.  దీనితో ఈ సీరియల్ ని మరోసారి ప్రసారం చేయాలనీ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

దేశ ప్రజల కోరిక మేరకు .. ఈ రామాయణ్ సీరియ‌ల్‌ ను శ‌నివారం నుంచి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు.  ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్‌ ప్ర‌సారం అవుతుంది.
Tags:    

Similar News