వర్మనే కలిచి వేసిన సంఘటన ఇదీ

Update: 2020-01-07 07:48 GMT
బంధాలు, భవబంధాలు, కుటుంబం, తొక్క తోలు ఇలాంటి అనుబంధాలకు దూరంగా ఉండే రాంగోపాల్ వర్మ కూడా స్పందించాడంటే అది ఎంత పెద్ద విషాదమో అర్థం చేసుకోవచ్చు. అత్యంత వివాదాస్పద దర్శకుడిగా ముద్రపడ్డ రాంగోపాల్ వర్మ తన సినిమాలు, చేష్టలు, కామెంట్లతో చాలా మందిని బాధపెట్టి ఉంటారు. అయితే ఎవరెన్ని తిట్టినా బాధపడని వర్మ ఫస్ట్ టైం బాధపడ్డాడు. ఈ మధ్య చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నాడు. మానవత్వాన్ని తట్టిలేపుతున్నారు. మారిన వర్మను చూసి అంతా షాక్ అవుతున్నారు.

నిత్యం వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ దిగ్ర్బాంతి పరిచింది. వర్మయేనా ఇలా చేసిందని ఒకటికి రెండు సార్లు అంతా తరిచిచూశారు.

తాజాగా వర్మ ట్వీట్ చేస్తూ ‘దిశ హత్యాచారాన్ని మరువక ముందే ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న భయానక ఘటన గురించి గెలుసుకొని తన హృదయం ద్రవించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటికి కఠినమైన సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించారు.

ఈ ట్వీట్ చూసి వర్మపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రజల బాధకు కూడా స్పందించేంత సున్నితమైన హృదయం నీదా అని ఆశ్చర్య పోతున్నారు. ఏది ఏమైనా వర్మ స్పందన మాత్రం కదిలిస్తోంది.
Tags:    

Similar News