అదేంది రాజ్ నాథ్ అలా కూడా చేస్తావా?

Update: 2015-07-28 04:34 GMT
ఓపక్క భీకర ఉగ్రదాడి జరుగుతోంది. ఇలాంటి సమయాల్లో దేశ హోంమంత్రి ఏం చేస్తున్నారు? ఊహించని విధంగా విరుచుకుపడిన ఉగ్రవాదుల పీచమణిచేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఎప్పటికప్పుడు పరిణామాల్ని సమీక్షిస్తూ.. అన్ని వ్యవస్థల్ని అలెర్ట్ చేయాల్సిన హోం మంత్రి ఏం చేశారో చూస్తే.. షాక్ తినాల్సిందే.

గురుదాస్ పూర్ ఉగ్రఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తే.. హోంమంత్రి వైఖరి అభ్యంతరకరంగా సాగటం గమనార్హం. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఢిల్లీలో ఉన్న ఆయన.. నాలుగు ఆదేశాలు జారీ చేసేసి.. తనదారిన తాను వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ లోని బోఫాల్ లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాజ్ నాథ్ వెళ్లిపోయారు.

ఒకవైపు ఉగ్రవాదులకు.. పోలీసులకు.. భద్రతదళాలకు పెద్ద ఎత్తున పోరాటం జరుపుతుంటే.. మరోవైపు అదేమీ పట్టనట్లుగా రాజ్ నాథ్ భోఫాల్ వెళ్లటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. హోం శాఖ అధికారులు మాత్రం.. రాజ్ నాథ్ భోపాల్ పర్యటనకు ముందు.. ఉగ్రదాడి విషయంలో అనుసరించాల్సిన అంశాలపై ఆదేశాలు ఇచ్చి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆదేశాలు ఇవ్వటానికి.. దగ్గరుండి పరిశీలించటానికి మధ్య వ్యత్యాసం ఎంతో ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. రాజ్ నాథ్ వైఖరిపై ప్రధాని మోడీ సైతం సీరియస్ అయ్యారని చెబుతున్నారు.
Tags:    

Similar News