ఒక భార్య..ఇద్దరు భర్తలు...బిగ్ ట్విస్ట్ ఏంటంటే ?
అయితే సడెన్ గా ఆమె కనిపించకుండా పోవడంతో ఆ ఇద్దరు భర్తలు ఒకరి తరువాత మరొకరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆమె కనబడడం లేదని ఫిర్యాదు చేశారు.;
ఒక రాధ ఇద్దరు క్రిష్ణులు మాదిరిగా ఒక భార్య ఇద్దరు భర్తలతో తన జీవితం కొనసాగించింది. అయితే సడెన్ గా ఆమె కనిపించకుండా పోవడంతో ఆ ఇద్దరు భర్తలు ఒకరి తరువాత మరొకరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆమె కనబడడం లేదని ఫిర్యాదు చేశారు. దాంతో షాక్ తినడం పోలీసుల వంతు అయింది. ఇది చాలదు అన్నట్లుగా పోలీసులు సీరియస్ గా ఈ కేసు విచారిస్తే సదరు వివాహిత మూడవ భర్తను ఎంచుకుని మరీ జంప్ అయిందని తేలింది. దీంతో టోటల్ గా అంతా షాక్ తినేశారు.
మ్యారేజ్ స్కాం గా :
స్కాములు సవా లక్షగా ఈ రోజున దేశంలో జరుగుతున్నాయి. అందులో మ్యారేజ్ స్కాములు కూడా ఉన్నాయి. ఇది ఆ జానర్ లోకి వస్తుందని పోలీసులు అంటున్నారు. విషయానికి వస్తే కర్ణాటకలోని దొడ్డబళ్ళాపురలో ఈ తమాషా జరింది. తన భార్య సుధారాణి కనిపించడం లేదని వీరే గౌడ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే తన భార్య కూడా కనిపించడం లేదని అనంతమూర్తి అనే మరో వ్యక్తి వచ్చి అదే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన భార్య పేరు కూడా సుధారాణియే. దాంతో పోలీసులు ఖంగు తిన్నారు.విచారించి చూస్తే ఇద్దరి భార్యలు ఒక్కరే అని తేలింది. దాంతో ఫిర్యాదు చేసిన ఇద్దరు భర్తలూ నోళ్ళెళ్ళబెట్టారు. సుధారాణి ఈ ఇద్దరినీ వివాహం చేసుకుని మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.
పిల్లలు ఉండగానే :
ఇక సుధారాణికి మొదట వీరేగౌడతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తకు బైకు కానీ కారు కానీ నడపడం చేతకావడం లేదని సాకుగా చూపించి దూరం పెట్టేసింది. అదే సమయంలో అనంతమూర్తి అనే డెలివరీ బాయ్ తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరూ ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్ళి చేసుకున్నారు. ఇక అనంతమూర్తిని పూర్తిగా నమ్మింది అతని నుంచి ఏకంగా 20 లక్షల రూపాయల దాకా వసూలు చేసిన సుధారాణి కనకపురాకు చెందిన మరో వ్యక్తితో జంప్ చేసింది. ఈ విషయాలు అన్నీ పోలీసుల లోతైన దర్యాప్తులో బయటపడ్డాయి.
లోగుట్టు బయటకు :
ఒకే సారి ఇద్దరు భర్తలు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ గుట్టు బయటపడింది అని పోలీసులు చెబుతున్నారు. ఇది పక్కా మ్యారేజ్ స్కాం ని అంటున్నారు. ఇపుడు పోలీసులు సదరు వివాహిత ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో జోరు పెంచారు. ఆమె ఆచూకీ తెలుసుకుని వెనక్కి తీసుకుని రావాలని అనుకుంటున్నారు. అయితే ఆమె మూడవ భర్తని ఫిక్స్ చేసుకుంది. ఫిర్యాదు చేసి వెయిటింగ్ లో ఇద్దరు భర్తలు ఉన్నారు. ఆమెని ఎవరికి అప్పగిస్తారు అన్నదే అసలైన ట్విస్ట్ గా ఉంది. మొత్తానికి గుండెలు తీసిన బంటుగా ఈ వివాహిత చేసిన పనిని స్థానికంగా జనాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.