అభిమానులకు తలైవా బర్త్ డే గిఫ్ట్ ఇస్తారా?
తమిళనాట ఊహాగానాలకు కొదవలేదు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పుణ్యమా అని.. ఎప్పుడేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరురాజకీయ పార్టీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. అక్కడి రాజకీయం మరింత వేడెక్కుతోంది. రజనీ.. ఆ తర్వాత కమల్ లాంటి అగ్రతారలు రాజకీయ పార్టీలు పెట్టేందుకు సిద్ధం కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశానని.. మరికొద్దిరోజుల్లో పార్టీ పెట్టనున్నట్లుగా కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చేయగా.. రజనీ మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఆయన గుంభనంగా ఉన్నారు. కొంతలో కొంత రజనీ సతీమణి మాత్రం తలైవా రాజకీయాల్లోకి రానున్న మాటను చెప్పేశారు
ఇదిలా ఉండగా.. కమల్ తన పార్టీకి సంబంధించిన వివరాల్ని తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారన్న ఊహాగానం భారీ ఎత్తున సాగింది. అయితే.. అందుకు భిన్నంగా ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాకుంటే.. త్వరలోనే తాను రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు చెప్పారు.
కమల్ బర్త్ డే పూర్తి కావటంతో ఇప్పుడు రజనీ బర్త్ డే మీద మీడియా.. రాజకీయ వర్గాల దృష్టి పడింది. డిసెంబరు 12న రజనీ పుట్టిన రోజు నేపథ్యంలో.. ఆ రోజున ఆయన తన పార్టీకి సంబంధించిన కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రజనీ అంత త్వరగా పార్టీ ప్రకటన చేయరన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. వేరే పార్టీలోకి వెళ్లటం కానీ.. జత కట్టటం కానీ ఉండవని.. సొంతంగా పార్టీ పెట్టటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. బర్త్ డే సందర్భంగా పార్టీ ప్రకటన ఉండే అవకాశం తక్కువని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. పుట్టినరోజునాడు పార్టీకి సంబంధించిన కీలకమైన ప్రకటన దాదాపుగా ఉండదనే చెప్పాలి.