దారుణం: మతగురువు పై బతికి ఉండగానే పెట్రోల్ పోసి నిప్పు

Update: 2020-10-11 08:10 GMT
రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ మతగురువుపై పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. ఓ స్థలం విషయంలో ఓ గ్రూపుకు చెందిన వ్యక్తులు గొడవకు దిగి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో మతగురువు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మతగురువుపై పెట్రోల్ పోసి చంపడంతో ఆ ప్రాంతమంతా అట్టుడికింది. రూ.50 లక్షల నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే దాకా శవాన్ని కదలనీయమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే జైపూర్ ఎంపీ రాంచరణ్ బోరా ఆ బాధిత కుటుంబాన్ని కలిసి వారి డిమాండ్లను అక్కడ అధికార ప్రభుత్వమైన కాంగ్రెస్ కు వినిపిస్తామని హామీ ఇచ్చారు.

మతగురువుకు గ్రామంలోని రాధాకృష్ణ దేవాలయం ట్రస్ట్ కు చెందిన 5.2 ఎకరాల భూమి ఉంది. జైపూర్ కు 177 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థలాన్ని మత గురువుకు ఆదాయ వనరుగా ట్రస్ట్ అప్పగించింది. ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలని ఆయన భావించారు. స్థలాన్ని చదును చేయిస్తున్నారు.

అదే టైంలో మీనా కమ్యూనిటీకి చెందిన ఓ గ్రూపు ఎంటర్ అయ్యి స్థలం తమదంటూ గొడవకు దిగింది. ఈ క్రమంలోనే మతగురువుపై ఆరుగురు వ్యక్తులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రికి తరలించగా.. కాలిన గాయలతో ఆయన స్టేట్ మెంట్ ఇచ్చాడు. గురువారం చికిత్స పొందుతూ మరణించారు.

నిందితులపై హత్య కేసు నమోదు చేశారు. కైలాష్ మీనా, శంకర్ , నమో మీనా అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News