• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వాళ్లని కాల్చి...

వాళ్లని కాల్చి చంపేయాలి..ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

By - Tupaki Desk
Update: 2020-03-31 11:30 GMT
దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కంట్రోల్ లోకి వస్తుంది అని అనుకుంటున్న తరుణంలోనే మళ్లీ దేశంలో కరోనా భయం ఒక్కసారిగా పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం ఢిల్లీలోని నిజాముద్దీన్ వద్ద మార్చి 13 నుంచి 15 మధ్య జరిగిన మతపరమైన భారీ ప్రార్థన సభ (మర్కజ్). కరోనా తో దేశం మొత్తం అల్లకల్లోలం అవుతున్న సమయంలో ఇలాంటి సభలు ఎలా నిర్వహిస్తారని , దేశంలో అప్పటికే కరోనా ముప్పు ఉన్నందున ఈ సభకు ఎలా అనుమతి ఇచ్చారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు.

ఈ సభకి దేశంలో మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది వ్యక్తులు హాజరయ్యారని , అంతేకాక, ఇండోనేసియా సహా విదేశాల నుంచి ఎంతో మంది మత ప్రబోధకులు ఈ సభకు వచ్చి ప్రసంగించారని అయన తెలిపారు. ఈ ఘటన పై మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.ఈ సభకు హాజరైన వారే ఎక్కువ మంది కరోనా పాజిటివ్‌లుగా తేలుతుండడం తో వారికి సంబంధించిన వారికి వైద్యాధికారులు పరీక్షలు జరుపుతున్నారని అన్నారు.

అయితే, కొన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వారు సహకరించడం లేదని, అలాంటివారిని కాల్చి పారేయాలని వ్యాఖ్యానించారు. వారిని చంపేసి దేశాన్ని, తెలంగాణ, ఏపీని కాపాడుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వల్ల అందర్నీ ప్రమాదంలో పెట్టలేమని అన్నారు. మొత్తం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తాను కోరుతున్నానని, ఆ ప్రార్థనలతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని , వారు సహకరించకపోతే వారిని అక్కడే కాల్చి పారేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • BJP 
  • telangana 
  • Raja Singh 
  • Corona 
  • covid 19 

Similar News

బీజేపీ మాధవ్ కి మరో పరీక్ష

2026-11-18 03:35 GMT

పాదయాత్రకు జగన్ తొందర...రీజన్ అదేనా ?

2026-11-18 03:35 GMT

వైసీపీ ట్రాప్ లో షర్మిల...నిజమేనా ?

2026-11-18 03:34 GMT

పతులు ఎమ్మెల్యేలు...సతులు ఊరి పెద్దలు !

2026-11-18 03:34 GMT

నంబర్ 850....బీజేపీ భారీ వ్యూహం !

2026-11-18 02:46 GMT

నాలుగు సార్లు విజేతగా సోనియా... రాహుల్ చెప్పిన నిజం

2026-11-18 02:46 GMT

పహల్గాం ఉగ్రదాడి.. రూ.4 కోట్లు కోల్పోయిన రిటైర్డ్ లాయర్ కథ

2026-11-18 02:46 GMT

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

Copyright @2026

Powered by Blink CMS