ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు
| ఐపీఎల్ 2027 వేలానికి ముందు ఫ్రాంచైజీలు భారీ స్థాయిలో ఆటగాళ్లను విడుదల చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్, కమిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, జెరాల్డ్ కొయెట్జీ సహా పలువురిని వదులుకుంది. దీంతో జట్టు పర్స్‌లో రూ.40.15 కోట్లు మిగిలాయి. లక్నో రూ.47.45 కోట్లతో అత్యధిక పర్స్ కలిగిన జట్టుగా నిలిచింది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలంలో హెడ్ సహా పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ఐపీఎల్ అంటేనే క్రికెట్ కంటే ఎక్కువగా డ్రామా.. ఎమోషన్స్.. ఊహించని ట్విస్టులు ఉండే రియాలిటీ షో లాంటిదబ్బా.. 2027 సీజన్ మొదలవడానికి ముందే ఫ్రాంచైజీలన్నీ పాత బంధాలకు టాటా.. కొత్త ముఖాలకు వెల్‌కమ్ అంటూ భారీ ప్రక్షాళనకు తెరలేపాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలైన హైలైట్ మాత్రం మన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తీసుకున్న సంచలన నిర్ణయమే.. మొన్నటి వరకు మా ఓపెనర్.. మా తురుపుముక్క అంటూ నెత్తిన పెట్టుకున్న ట్రావిస్ హెడ్‌కు కావ్య పాప ఒక్క దెబ్బతో గుడ్‌బై చెప్పేసి ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
గత సీజన్లలో బౌలర్లకు చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్‌ను ఇలా నిర్దాక్షిణ్యంగా రిలీజ్ లిస్టులో పడేస్తారని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. హెడ్‌తో పాటు కమిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మధుశంక, జెరాల్డ్ కొయెట్జీలను కూడా బయటకు పంపించేశారు. చూస్తుంటే కావ్య పాప ఈసారి జట్టుకు పూర్తిస్థాయి మేకోవర్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్లుంది. ఈ భారీ తొలగింపుల పుణ్యమా అని ఎస్‌ఆర్‌హెచ్ పర్స్ ఇప్పుడు రూ.40.15 కోట్లతో కళకళలాడుతోంది. చేతిలో 7 ఖాళీ స్లాట్లు అందులో 3 విదేశీ కోటా పెట్టుకుని గోవా వేలంలో ఏ రేంజ్‌లో బీభత్సం సృష్టిస్తారో చూడాలి.
కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. మిగతా ఫ్రాంచైజీలు కూడా తమ స్టార్ ప్లేయర్లకు గట్టిగానే షాక్ ఇచ్చాయి. ముంబయి ఇండియన్స్ అయితే ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కేశవ్ మహరాజ్‌లకు థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీసెస్ అనేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కోట్లు పోసి కొన్న మిచెల్ స్టార్క్‌తో పాటు నితీశ్ రాణా, బెన్ డకెట్‌లకు బై బై చెప్పేసింది. లక్నో జట్టు అవేశ్ ఖాన్, హసరంగ, నోకియాను వదిలించుకోగా.. పంజాబ్ కింగ్స్ లాకీ ఫెర్గూసన్, నేహల్ వధేరా, మిచ్ ఓవెన్‌లను ఇంటికి పంపింది. గుజరాత్ షారుఖ్ ఖాన్, ఇశాంత్ శర్మలను.. కేకేఆర్ పథిరనను.. రాజస్థాన్ హెట్‌మయర్, తుషార్ దేశ్‌పాండేలను వదిలేశాయి. ఆర్సీబీ కూడా జాకబ్ బెథెల్ సహా కొందరిని రిలీజ్ చేసింది.
చెన్నై జాబితాలో మాత్రం ఎంఎస్ ధోని పేరు రిటైర్డ్ విభాగంలో మెరవడం విశేషం. ధోని ఐపీఎల్ కురిటైర్ మెంట్ ప్రకటించి సీఎస్కే మెంటర్ గా జాయిన్ అయిపోయారు.
డిసెంబర్ 16న గోవా బీచ్‌ల పక్కన జరగబోయే ఐపీఎల్ వేలంలో డబ్బుల వర్షం కురవడం ఖాయం. పర్స్ బ్యాలెన్స్ చూస్తే లక్నో సూపర్ జెయింట్స్ రూ.47.45 కోట్లు 'కుబేరుడి' స్థానంలో ఉండగా.. కోల్‌కతా రూ.41.65 కోట్లు, హైదరాబాద్ రూ.40.15 కోట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ రూ.39.5 కోట్లు, ముంబయి రూ.32.6 కోట్లు, చెన్నై రూ.28.05 కోట్లు, రాజస్థాన్ రూ.27.05 కోట్లు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఇక పంజాబ్ రూ.18.6 కోట్లు, ఆర్సీబీ రూ.14.5 కోట్లు, గుజరాత్ రూ.8.75 కోట్లు మాత్రం బడ్జెట్ చూసుకుని ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి.
ట్రావిస్ హెడ్ లాంటి విధ్వంసకర ఆటగాడు వేలంలోకి రావడంతో ఫ్రాంచైజీల మధ్య మైండ్ గేమ్స్ అప్పుడే మొదలయ్యాయి. వదిలేసిన ఆటగాళ్లను మళ్లీ తక్కువ ధరకు కొంటారా.. లేక కొత్త కుర్రాళ్లతో సరికొత్త సమీకరణాలు రచిస్తారా అనేది డిసెంబర్ 16న తేలిపోనుంది.