తెవాటియా బతికించావ్.. ఆ ఒక్కటీ సిక్స్ కొట్టకుండా..యూ వీ ట్వీట్
షార్జా వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్మిత్, శాంసన్ తో పాటు చివర్లో వచ్చి అనూహ్యంగా జట్టుకు విజయాన్ని అందించిన తెవా టియా ఒక్కసారిగా హీరో గా మారిపోయాడు. ఎవరీ ఆటగాడు అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. మ్యాచ్ చేధించే క్రమంలో రాజస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉండగా తెవాటియా ఓకే ఓవర్ లో ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ఇతడి ఆటపై మాజీ ఆటగాళ్లు ప్రశంసిస్తుండగా సిక్సర్ల వీరుడు యువరాజ్ కూడా స్పందిస్తూ అతడిని మెచ్చుకున్నాడు. జట్టు కొండంత లక్ష్యం ఛేదిస్తుండగా బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన తెవాటియా జిడ్డు ఆట ఆడటం మొదలు పెట్టాడు. ఈ సమయంలో ఇదే ఆటరా.. బాబూ అంటూ టీవీలకు అతుక్కు పోయిన వాళ్లు తిట్టు కోవడం మొదలు పెట్టారు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేసిన తెవాటియా ఆ తర్వాత అసలు సినిమా చూపించాడు. ఓటమి ఇక ఖాయం అనుకుంటున్న వేళ షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో మొత్తం 5 సిక్సులు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి ఆట సిక్సర్ల వీరుడు యువరాజ్ ని తలపించింది. అతడిలాగే ఆరు సిక్సర్లు కొట్టేస్తాడని అనుకున్నా ఐదు బాదేశాడు. దీంతో ఒక్క ఓవర్ లో 30 పరుగులు రావడంతో రాజస్థాన్ గెలుపు లాంఛనం అయ్యింది.
2007 లో ఇంగ్లాండ్ లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో యువరాజ్ బ్యాటింగ్ చేస్తుండగా..ప్లింటాఫ్, బౌలర్ బ్రాడ్ అతడిని రెచ్చగొట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువరాజ్ బ్రాడ్ బౌలింగ్ ని తుత్తునియలు చేశాడు. వేసిన ప్రతి బాల్ ని సిక్స్ గా సంధించాడు. కేవలం 12 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసి భారత్ కు విజయాన్ని కట్టబెట్టాడు. నిన్న పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ లో తెవాటియా యువరాజ్ ని తలపించాడు. కాట్రేల్ బౌలింగ్ లో ఒక్క ఓవర్ లో ఐదు సిక్సర్లు బాదాడు. దీనిపై యువరాజ్ స్పందించాడు. ' తెవాటియా.. ఒక బంతిని సిక్స్ కొట్టకుండా వదిలేసినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. రాజస్థాన్ జట్టుకు అభినందనలు. మయాంక్ - సంజూ శాంసన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడారు ' అని యూవీ ట్వీట్ చేశాడు.