మోదీ ముంచారు...ఇక రాహుల్ తరువాయి

Update: 2018-09-19 13:24 GMT
"ప్రత్యేక హోదా"........."ఆంధ్రప్రదేశ్‌ కు స్పేషల్ స్టేటస్.......కాదు...ప్రత్యేక ప్యాక్యేజీ ........హోదా వద్దు...........ప్యాకేజీ యే ముద్దు. ఈ మాటలు - ఇటువంటి వాగ్దానాలు  ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత నాలుగేళ్లుగావినీ వినీ విసిగిపోయారు. గతంలో బిజేపీ పార్టీ కూడా ఇటువంటి వాగ్దానాలు చేసి చివరకి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిట్టనిలువునా ముంచేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిమిషానికి ఒక మాట మాట్లాడుతూ ఊసరవెల్లిలా  రంగులు మారుస్తున్నారని - ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాపోతున్నారు.

ప్రస్తుతం ప్రత్యేక హోదా నినాదంతో ప్రజలలోకి వెడుతున్న రాహుల్ గాంథీని తాము ఎలా విశ్వసించవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీని విశ్వసించ వచ్చా లేదా అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందర ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న.  2019లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చి కేంద్రంలో ప్రభుత్వాని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు  ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వంతోను - తమిళనాడులో స్టాలిన్‌ తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రత్యేక హోదాకు మిగత పార్టీలు అంగీకరించవని - అప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టాలలో పడుతుంది కాబట్టి రాహుల్ గాంథీ ప్రత్యేక హోదా విషయాన్ని భారతీయ జనతా పార్టీ లాగే మరుగున పడేస్తారని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంథీ ఉన్న పరిస్థితులలో ఆయన ఆంధ్రప్రజలకు ఎటువంటి వాగ్దానాలు చేసిన ఆయనకు పోయేది ఏమి లేదు, ఎందుకంటే 2019 ఎన్నికలలో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మద్దత్తు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. కాంగ్రెస్ పార్టీ కనుక పొత్తులతో ప్రభుత్వాని ఫార్మ్  చేస్తే ప్రత్యేక హోదాకు మిగతా పార్టీలు ఒప్పుకోవాటం లేదని తప్పించుకోవచ్చు...... అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక ఓటమి పాలైతే ప్రత్యేక హోదా అంశం 2024 వరకూ మాట్లాడక్కర్లేదు....లేదూ సంపూర్ణ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాహుల్ గాంథీని విశ్వసించ వచ్చు.......ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మాత్రం రాహుల్ గాంథీ మాటలు విశ్వసించే పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యాటించారు. ఈ సందర్భంగా " సత్యమేవ జయతే"  పేరిట బహిరంగ సభలో  ప్రసంగించారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని - తమ పార్టీ   అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. తాను ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు మీదే పెడతానని రాహుల్  అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజాయితి గల పార్టీ అని - ఒక్కసారి మాట ఇస్తే, ఆ మాట మీద నిలబడి తీరుతుందని రాహుల్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తర్వాతే మళ్లీ తాను కర్నూలులో అడుగుపెడతానని ఆయన శపథం చేసారు.
Tags:    

Similar News