రాహుల్ - కురియన్.. కామెడీ ఆఫ్ ద ఇయర్!
దేశ ప్రజలు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇప్పుడిప్పుడే సీరియస్ గా తీసుకుంటున్నారు. రాహుల్ ను ఇన్నాళ్లూ ఒక విధూషకుడిగా చూసిన వాళ్లు ఇప్పుడిప్పుడే ఆయనపై వ్యూ ను మార్చుకొంటూ ఉన్నారు! ఇదంతా కాంగ్రెస్ నేతలకే ఇష్టం లేనట్టుగా ఉంది పాపం! రాహుల్ ను యథారీతిన కామెడీ మెటీరియల్ గా మార్చేందుకు కాంగ్రెస్ నేతలు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అందుకు నిదర్శనమే ప్రస్తుతం వైరల్ గా మారిన రాహుల్ గాంధీ కేరళ ప్రచార పర్వంలోని ఒక వీడియో!
కేరళ సినిమా దర్శకులు తీసే కామెడీ సినిమాలకు దేశమంతా క్రేజ్ ఉంటుంది. బోలెడన్ని కామెడీ సినిమాలకు మూలాలు కేరళలోనే ఉంటాయి. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ను పండించడంలో మలయాళీ దర్శకులు పేరెన్నికగల వాళ్లు. అలాంటి దర్శకుల క్రియేటివిటికీ ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.. ఈ వీడియో అని చెప్పనడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు!
అత్యంత సహజంగా, అంత ప్రహసనంగా… ముందుగానే కామెడీ చేయమని ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టుగా రెచ్చిపోయారు పీజే కురియన్. తనలో అద్భుతమైన టైమింగ్ కమేడియన్ ఉన్నారని ఆయన నిరూపించుకున్నారు! రాహుల్ ప్రసంగాన్ని తనకు ఇష్టం వచ్చినట్టుగా మలయాళంలోకి అనువదించడంలో అయినా, తన హావభావాలతో నవ్వులు పండించడంలో అయిన కురియన్ దేశంలోని మరే కమేడియన్ సాటి రాని రీతిలో, మరే కమేడియన్ నవ్వించని రీతిలో నవ్వించారు! ఈ ప్రహసనంలో ఆయనకు మైక్ సెట్ కూడా భలే సహకరించింది. రాహుల్ ప్రచార పర్వాన్ని మొత్తం కామెడీగా మార్చేయడంలో మైకు సెట్ పాత్ర కూడా ఎనలేనిది!
తనను కావాలని కామెడీ చేస్తున్నాడో, లేక ఆయన తీరే అంతో అర్థం చేసుకోలేక తంటాలు పడటం రాహుల్ గాంధీ వంతు అయ్యింది. పలు సార్లు రాహుల్ బేలగా కురియన్ వైపు చూశారు. 'మరీ నవ్వుపాల్జేస్తున్నావ్..' అన్నట్టుగా పలు సార్లు రాహుల్ గాంధీ ఆయన వైపు చూశారు. ఒక దశలో ఆయనను పక్కకు తోసేసి వేరే ఎవరినైనా అనువాదకుడిగా తీసుకురండన్నట్టుగా కూడా రాహుల్ చూశారు పాపం. అయినా ఆయన అసహాయుడయ్యాడు.
మలయాళం ముక్క కూడా రాని రాహుల్ గాంధీకే కురియన్ తనతో ఆటాడించేస్తున్నాడని అర్థం అయిపోయింది. ఇక జనాలకు అయితే ఇదో అపురూప హస్యభరితమైన స్కిట్ అయ్యింది. అందుకే వైబ్ లో ఇది వైరల్ గా మారింది.
ఏదో కేరళలో పోటీ చేసి.. దేశమంతా రాజకీయ వేడిని రాజేద్దామని అనుకున్నా రాహుల్ గాంధీ ప్రయత్నాలను బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఇంతకీ ఈ కురియన్ ఎవరో చెప్పనక్కర్లేదు.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించారే ఆయనే ఈయనే! సోనియాకు వీరవిధేయ కాంగ్రెస్ నేత! కానీ రాహుల్ ను మాత్రం కామెడీ పీస్ గా చేసేశారాయన! వీర విధేయులతో ఇదే ఇబ్బంది కదా రాహుల్ సాబ్!
Full View