'#రాహుల్ లవ్ టెర్రరిస్ట్స్'.. ఇప్పుడిదే వైరల్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తాజాగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేసింది. అందులో రాహుల్ గాంధీ.. కరుడుగట్టిన పాకిస్తాన్ తీవ్రవాది మసూద్ అజార్ ను ఉద్దేశించి ‘మసూద్ అజార్ జీ’ అంటూ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదికి రాహుల్ గాంధీ గౌరవం ఇచ్చేలా మాట్లాడడంపై బీజేపీ ఫైర్ అయ్యింది. రాహుల్ గాంధీని విమర్శిస్తూ వీడియో రిలీజ్ చేసి వైరల్ చేస్తోంది..
రాహుల్ గాంధీ ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘బీజేపీ పెద్ద మనిషి మోడీ తనకు 56 ఇంచుల ధృఢమైన చాతి ఉందని.. భయపడనని అంటాడు.. కానీ ఆయన అనుయాయుడైన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ మాత్రం ఉగ్రవాది మసూద్ అజార్ జీని వెంటబెట్టుకొని మరీ విమానంలో తీసుకెళ్లి కాందహార్ లో దించివస్తాడు’ అంటూ విమర్శించాడు.
దీనిపై తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలందరూ దేశానికి నష్టం చేకూర్చే ఉగ్రవాదులను పొడుతున్నారని.. మొన్న దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని.. ఓసామా జీ, హఫీజ్ సయిద్ జీ అంటూ గౌరవంగా మాట్లాడారని దుయ్యబట్టారు. ఇప్పుడు రాహుల్ కూడా అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ను గౌరవించడం ఏంటని విమర్శించారు.
ఇక మరో కేంద్ర మంత్రి సృతీ ఈరానీ కూడా రాహుల్ నోరుజారడంపై ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీ, పాకిస్తాన్ మధ్య ఓ సాధారణ విషయం ఉంది. వారిద్దరూ ఉగ్రవాదులను ప్రేమిస్తారు. మసూద్ అజార్ ను రాహుల్ గౌరవంగా పిలవడం బట్టే ఇదే అర్థమవుతోంది’ అని ట్వీట్ లో విమర్శలు గుప్పించారు.
అంతేకాదు ఇప్పుడు బీజేపీ దీన్ని ఎన్నికల వేళ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లి రాహుల్ ను, కాంగ్రెస్ ను ఇరుకునపెట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘రాహుల్ లవ్ టెర్రరిస్ట్’హ్యాష్ ట్యాగ్ తో పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడిది వైరల్ అయ్యింది.
ఈ విమర్శలపై కాంగ్రెస్ తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ బీజేపీని విమర్శించిన మాటలను పక్కనపెట్టి మసూద్ పై నోరుజారాడంటూ రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జావాలా మండిపడ్డారు.
ఇక నెటిజన్లు కూడా రాహుల్ కు ఈ హ్యాష్ ట్యాగ్ పై సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీ నాన్న - నాయినమ్మ టెర్రరిస్టుల దాడిలో చనిపోయినా.. ఇంకా ఆయనకు ఉగ్రవాదులపై ప్రేమ తగ్గలేదంటూ విమర్శిలు గుప్పిస్తున్నారు.