ఈ గ‌డ్డం క‌థేంటి ర‌ఘువీరా?

Update: 2016-03-03 11:13 GMT
నిత్యం క్లీన్ షేవ్ తో మిల‌మిల మెరిసిపోయే వంద‌రూపాయిల నోటులా క‌నిపించే ఏపీకాంగ్రెస్ సీనియ‌ర్ నేత ర‌ఘువీరారెడ్డిలో ఈ మ‌ధ్య మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. వైఎస్ హ‌యాంలో నాటి విప‌క్ష‌నేత చంద్ర‌బాబుపై ఓ రేంజ్ లో విరుచుకుప‌డే ఆయ‌న నిత్యం మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చేవారు. ఇక‌.. అసెంబ్లీ స‌మావేశాల్లో అయితే.. వైఎస్ త‌ర్వాత ఆ రేంజ్ లో కాకున్నా.. కాస్త త‌క్కువ‌గా విరుచుకుప‌డే కొద్దిమందిలో ర‌ఘువీరా ఉండేవారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో కునారిల్లిన కాంగ్రెస్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఆయ‌న.. పార్టీకి త‌గ్గ‌ట్లే నీర‌సంగా క‌నిపించ‌టం మొద‌లెట్టారు.

అస‌లే విప‌క్షం.. ఆ పై విభ‌జ‌న శాపం మోస్తున్న కాంగ్రెస్ కు.. ర‌ఘువీరా గ‌డ్డం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న గ‌డ్డంతో పాటు ముస‌లిత‌నం ఛాయ‌లు ర‌ఘువీరాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటాయి. క్లీన్ షేవ్ లో క‌ల‌ర్‌ ఫుల్‌ గా క‌నిపించే ర‌ఘువీరా.. ఇలా పెద్ద గ‌డ్డంతో పెద్ద‌వ‌య‌స్కుడిగా క‌నిపించ‌టం చూస్తే.. ప‌దేళ్లు మీద ప‌డ్డ‌ట్లు స్పష్టంగా క‌నిపిస్తోంది. క్యాడ‌ర్ కు మ‌రింత ఉత్సాహంగా క‌లిగించేలా ఉండాల్సిన ర‌ఘువీరా ఇలా గ‌డ్డంతో దైన్యంగా క‌నిపించ‌టం బాగోలేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News