జగన్ ఇలాకాలో ఎంఐఎం....ఈక్వేషన్స్ చేంజ్ ?
తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో నడుస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మనసు ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల మీద పడింది.
తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో నడుస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మనసు ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల మీద పడింది. ఏపీ లోకల్ ఫైట్ లోకి తాను సై అంటూ ఎంఐఎం దూసుకొస్తోంది. ఆ పార్టీ సెలెక్టివ్ గా మైనారిటీలు ఎక్కువగా ఉన్న చోట్ల తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దించాలని చూస్తోంది అంటున్నారు. దాని కోసం భారీ కసరత్తునే చేసింది. ఇక ఏపీలో రాయలసీమలోని కీలక స్థానాలనే టార్గెట్ చేస్తూ ఎంఐఎం బరిలోకి నిలుస్తోంది.
మొత్తం 21 స్థానాలలో పోటీ :
ఇదిలా ఉంటే ఎంఐఎం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 21 స్థానాలలో పోటీకి సిద్ధమని చెబుతోంది. అందులో కడప మేయర్ పదవికి ఇప్పటికే అభ్యర్ధిని నిలబెట్టింది. అలాగే హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా ఎంఐఎం పోటీ పడుతోంది. ఇలా ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న చోట పోటీ చేసి తన రాజకీయ బలాన్ని విస్తరించాలని ఎంఐఎం చూస్తోంది అని అంటున్నారు. ఇక ఈ రెండు చోట్ల కాకుండా మరో 19 స్థానాలలో పోటీకి సంబంధించిన ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీకి దెబ్బ :
ఎంఐఎం పోటీ చేసిన సీట్లు అన్నీ కూడా ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న చోట్లనే అని అంటున్నారు. దాంతో ఆ ఓట్లు ట్రెడిషనల్ గా ఎక్కువ వైసీపీకే పడతాయని చర్చ ఉంది. దాంతో ఎంఐఎం బరిలో ఉంటే ఓట్ల చీలిక ఖాయమని అంటున్నారు. అది ఎంత కాదనుకున్నా వైసీపీ విజయావకాశాలు మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ అధినేత సొంత జిల్లా కడప మేయర్ పీఠానికే ఎంఐఎం గురి పెట్టింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నాయి. అటు కూటమి ఇటు వైసీపీల మధ్య టగ్ ఆఫ్ వార్ గా సాగుతున్న పొలిటికల్ పోరులో ఎంఐఎం మధ్యన ఉంటే అది విపక్ష శిబిరానికి అందునా వైసీపీకి దెబ్బ పడేలా ఉంటుందని అంటున్నారు. ఎంఐఎం పోటీతో ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్లలో ఏ మేరకు చేంజ్ అవుతాయన్నది చూడాల్సి ఉంది.
శాంపిల్ గానేనా :
ఇదిలా ఉంటే ఎంఐఎం ఏపీ మీద చాలా కాలంగా ఫోకస్ పెడుతోంది. తెలంగాణాలో ఉన్న ఆ పార్టీ ఏపీలో కూడా తన పార్టీని విస్తరించుకోవాలని చూస్తోంది అన్న మాట ఎప్పటి నుంచో ఉంది. 2024 ఎన్నికలలో ఏపీ నుంచి ఎంఐఎం బరిలోకి దిగుతుందని ప్రచారం సాగింది. కానీ దిగలేదు. అయితే ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ద్వారా తమ బలం ఎంత ఉందని నిర్ధారించుకుని 2029 ఎన్నికల్లో నిఖార్సు అయిన పోటీకి ఎంఐఎం రెడీ అవుతుందని అంటున్నారు. మరి ఎంఐఎం పోటీతో ఏపీలో రాజకీయం ఏ విధంగా మారుతుందో చూడాల్సి ఉంది.