కోటికి సరిసాటి జనసేన... ట్రిపుల్ ఆర్ షాకింగ్ కామెంట్స్ !

ఏపీలో మూడవ ప్రాంతీయ పార్టీగా కుదురుకోవడానికి వచ్చింది జనసేన. టీడీపీ వైసీపీ బలమైన పార్టీలుగా ఉన్న నేపథ్యంలో జనసేన కూడా వాటి మాదిరిగానే ఎదగాలని చూస్తోంది.

Update: 2026-10-21 13:46 GMT

ఏపీలో మూడవ ప్రాంతీయ పార్టీగా కుదురుకోవడానికి వచ్చింది జనసేన. టీడీపీ వైసీపీ బలమైన పార్టీలుగా ఉన్న నేపథ్యంలో జనసేన కూడా వాటి మాదిరిగానే ఎదగాలని చూస్తోంది. ఈ క్రమంలో జనసేన తనదైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ ఏపీలో ముందుకు సాగుతోంది. పొత్తుల ఎత్తుల ద్వారా తాము బలపడాలని అనుకుంటోంది. అంతే కాదు ఏదో నాటికి రాజ్యాధికారం దిశగా తమ అడుగులు వేగంగా పడతాయని కూడా అంచనా వేసుకుంటోంది. జనసేనకు వెండి తెరపైన పవర్ స్టార్ ఇమేజ్ తో పాటు రియల్ లైఫ్ లో జనంలో ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ రధ సారధిగా ఉన్నారు. అందుకే జనసేన రీ సౌండ్ చేస్తే అది వేరే లెవెల్ అని అంటారు. ఆ పార్టీకి పవన్ అభిమానులే సైనికులు. అలాంటి జనసేన గురించి రాజకీయంగా సీనియర్ నాయకుడు, శాసనసభలో ఉప సభాపతిగా ఉన్న రఘురామ క్రిష్ణంరాజు మాటల్లో చెప్పాలీ అంటే జనసేన కోటికి సరిసాటి. ఇది ఆయన జనసేనకు ఇచ్చిన కితాబుగానే భావించాలి. ఏపీలో జనసేన గురించి ఒక యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో ట్రిపుల్ ఆర్ వెల్లడించిన ఈ అభిప్రాయాలు కానీ కామెంట్స్ కానీ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి.

ఒక్కో సైనికుడూ :

ఇది ట్రిపుల్ ఆర్ జనసేనకు ఇచ్చిన ఒక పవర్ ఫుల్ కాంప్లిమెంట్ గానే దీనిని తీసుకోవాలి. జనసేన సభ్యత్వం ఈ రోజున ఏపీ వ్యాప్తంగా 20 లక్షల దాకా ఉందని రఘురామ అంటూ అదే టీడీపీకి కోటి సభ్యత్వం ఉందని గుర్తు చేశారు. అయితే టీడీపీకి కోటికి జనసేన ఇరవై లక్షల సభ్యత్వం సరిసాటిగానే ఉంటాయని ఆయన కరెక్ట్ పోలికనే పెట్టారు. ఎందుకు అంటే జనసేనలో కరడు కట్టిన పవన్ అభిమానులు ఉన్నారని అన్నారు. వారే అతి పెద్ద సైన్యం అన్నారు. అందువల్ల ఒక్కో సభ్యత్వం అయిదుగురికి సమానం అని ఆయన చెప్పుకొచ్చారు. అంతటి బలం పవన్ ఇమేజ్ రెండూ దండీగా జనసేనకు ఉన్నాయని రఘురామ గుర్తు చేశారు.

హుషారెత్తించే లాగానే :

జనసేన గురించి ఈ లెక్కన ఏ నాయకుడూ ఇంతవరకూ చెప్పలేదు. రఘురామ మాత్రం జనసేన సత్తా గురించి చాలా బాగానే విశ్లేషించారు అని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే జనసేన కోరుకున్న విధంగానే కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేనకు కూడా ప్రభుత్వంలో వాటా ఉంది. నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సీట్లు కోరుకున్నవి కూడా చాలా చోట్ల తీసుకుంటోంది అని అంటున్నారు. ఇలా జనసేన గత రెండున్నరేళ్ళ అధికారంలో బాగానే తన బలం పెంచుకుంటోంది అన్నది కూడా ఉంది. అయితే రఘురామ కామెంట్స్ ని జనసేన సైనికులు ఒక వైపు ఆనందంగానే ఆస్వాదిస్తూనే జనసేన మరింతగా జోష్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

అసంతృప్తి ఉందా :

రఘురామ జనసేనకు ఇచ్చిన కాంప్లిమెంట్ మీద జనసైనికులు సామాజిక మాధ్యమాలలో తలో విధంగా స్పందిస్తున్నారు. పార్టీకి బలం బాగానే ఉంది, అధికారంలో వాటా కూడా ఉంది. కానీ ఇంకా తమకు తగిన గౌరవం దక్కడం లేదని, అధికారంలో పేరుకు మాత్రమే ఉన్నామన్నది వారి బాధ ఆవేదనగా ఉందని అంటున్నారు. ఈ విషయాలను గమనించి జనసేనని సరైన దారిలో పెట్టాల్సింది సేనాని పవన్ అని అంటున్నారు. ఈ విషయంలో కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ మౌనం మంచిది కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా జనసేనను రఘురామ ఒక ఎత్తుకు ఎత్తేశారు. జనసేన సామాన్యమైన పార్టీ కాదని సైన్యానికి అతి పెద్ద బూస్టప్ ఇచ్చేశారు.



Tags:    

Similar News