మోడీ మోసకారితనం...బాబు చేతగానితనం!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఆసక్తికరమైన ప్రకటనను ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి చేశారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ - జనసేన పార్టీలు తమ బాట పట్టడం హర్షణీయమని అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే తక్షణమే ప్రత్యేక హోదా అమలై ఉండేదని, రాష్ట్రానికి 10 నుంచి 20 వేల కోట్ల రూపాయల వరకు అదనపు నిధులు వచ్చి ఉండేవని తులసిరెడ్డి అభిప్రాయ పడ్డారు. కేంద్ర పన్నుల్లో రాయితీల కారణంగా దేశ - విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చేవన్నారు. మోడీ మోసకారి తనం, చంద్రబాబునాయుడు చేతగానితనం వల్ల హోదా హామీ అమలుకు నోచుకోలేకపోయిందని విమర్శించారు. హోదా కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని, హోదా సాధన కోసం ఎవరు ముందుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని తులసిరెడ్డి అన్నారు.
అనంతపురం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు ప్రజలకు దరిద్రమని ఆరోపించారు. సింగపూర్ లాంటి రాజధానిని నిర్మిస్తానని ప్రజలకు మాయమాటలు చెబుతూ విదేశీయులకు బూట్లు తుడవడం మానివేయాలని సూచించారు. కర్నాటక ముఖ్యమంత్రితో హెచ్చెల్సీ - ఎల్ ఎల్ సి సాగునీటి కోసం సంప్రదించాలని రఘువీరా హితవు పలికారు. ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి మార్గమధ్యంలో మొక్కజొన్న - వరి - పత్తి - జొన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్రహ్మసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ రెయిన్‌గన్లతో వేరుశనగ పంటను కాపాడుతానని రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని, కౌలు రైతుకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకూడదని కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రఘువీరా భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో 80 శాతం ఓట్లు అనుకూలంగా వస్తాయని తనకు అనుకూలమైన పత్రికల్లో - మీడియాలకు డబ్బులిచ్చి ప్రచారం చేసుకోవడం మానుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరిపితే చంద్రబాబుకు 20 శాతం ఓట్ల వస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రఘువీరా సవాల్ విసిరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/