జగన్ కోసం రఘువీరా బేరం మొదలెట్టారా?

Update: 2016-04-04 06:50 GMT
మొన్నా మధ్య నెల్లూరులో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ మాట్లాడుతూ.. ఏపీ కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు జగన్ కానీ పవన్ కల్యాణ్ కానీ పార్టీలోకి తీసుకురావాలంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయటం.. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే.

చింతామోహన్ కాదు.. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డే ఓపెన్ గా తన మనసులోని మాటను చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జగన్ కలిసిపోవాలని ఆయన కోరుతున్నారు. కాంగ్రెస్ లో చేరితేనే జగన్ కుభవిష్యత్తు ఉంటుందని చెబుతున్న రఘువీరాకు.. మాజీ ఎంపీ జేడీ శీలం వంత పాడుతున్నారు. విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పడిపోవటం.. సమీప భవిష్యత్తులో ఆ పార్టీ కోలుకునే ఛాన్స్ లేదన్న వాదన జోరుగా వినిపిస్తున్న సమయంలో.. రఘు వీరా నోటి నుంచి తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అనంతపురంలో మాట్లాడిన రఘువీరా.. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని.. ప్రాంతీయ పార్టీలకు విశాలమైన మనసు ఉండదని.. వాటి మనుగడ కష్టమని చెబుతున్న రఘువీరా.. మొత్తంగా జగన్ ను తమ పార్టీలోకి అర్జెంట్ గా వచ్చేయమంటున్నారు. తల్లి కాంగ్రెష్ లోకి పిల్ల కాంగ్రెస్ కలిస్తే కానీ.. తల్లి కాంగ్రెస్ కు హుషారు రాదన్న విషయాన్ని అర్థం చేసుకొని రఘువీరా ఇలా రివర్స్ గేర్ వ్యాఖ్యలు చేస్తున్నట్లుంది. ఒక్క సీటు కూడా గెలుచుకోని కాంగ్రెస్ పార్టీలో.. జగన్ తన పార్టీని విలీనం చేస్తారా..?
Tags:    

Similar News