ర‌ఘువీరా ఇలాంటి మాట‌లే డిపాజిట్లు పొగొట్టేది!

Update: 2018-07-27 10:39 GMT
ఏపీ ఇప్పుడున్న ప‌రిస్థితికి కార‌ణం ఎవ‌రంటే.. వేళ్లు అన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు.. ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియ‌మ్మ వైపు చూపిస్తాయి. విభ‌జ‌న వ‌ద్ద‌న్న వారిని సైతం వారించి.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఏపీని రెండు ముక్క‌లు చేయాల్సిందేన‌న్న మాట చెప్పి.. త‌న బ‌ర్త్ డే గిఫ్ట్ గా తెలుగు వారికి రెండు రాష్ట్రాల్ని కేటాయించిన ఘ‌న‌త సోనియ‌మ్మ‌దే. ఈ విష‌యంలో మ‌రో మాట‌కు అవ‌కాశ‌మే లేదు.

ఏపీ ప్ర‌జ‌ల అభిమ‌తానికి వ్య‌తిరేకంగా జ‌రిపిన విభ‌జ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఆంధ్రోళ్లు 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తామేం చేయాలో అది చేసి చూపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. మ‌ళ్లీ పాతికేళ్ల వ‌ర‌కూ కోలుకోలేని రీతిలో పాతిపెట్టేశారు.

ఇదిలా ఉంటే.. విభ‌జ‌న సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ఇచ్చిన ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీని అమ‌లు చేసే విష‌యంలో మోడీ ఇప్పుడు మోసం చేయ‌టంతో ఇప్ప‌డీ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేన‌న్న మాట అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ తీసుకుంది. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఏపీకిప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని తేల్చి చెప్పారు.

చేసిన త‌ప్పును కాంగ్రెస్ ఎట్ట‌కేల‌కు స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్న మాట వినిపిస్తున్న వేళ‌.. తాజాగా ఏపీ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి రఘువీరా ఆంధ్రోళ్ల‌కు ఒళ్లు మండే మాట‌ను చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింద‌ని..ఈ  మేర‌కు సీడ‌బ్ల్యూసీ సైతం ఓకే చేసింద‌న్నారు. ఇందుకు కార‌ణ‌మైన రాహుల్.. సోనియాల‌కు థ్యాంక్స్ చెప్పారు.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఉన్న‌ట్లుండి ర‌ఘువీరా మాట మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 25 లోక్ స‌భ స్థానాలు కాంగ్రెస్ కు ఇస్తేనే ప్ర‌త్యేక హోదా సాధ్య‌మ‌వుతుంద‌న్న ఒళ్లు మండే మాట‌ను చెప్పారు. ఏపీ విష‌యంలోకాంగ్రెస్ చేసిన పనికి మ‌రో పాతికేళ్ల వ‌ర‌కూ ఓడించినా.. మూసుకొని ఏపీకి ఇవ్వాల్సిన‌వి ఇవ్వాల్సిన ప‌రిస్థితి.

అందుకు భిన్నంగా.. ఏపీలో ఉన్న 25 లోక్ స‌భ స్థానాలు ఇస్తే కానీ.. ప్ర‌త్యేక హోదా సాధ్యం కాద‌న్న మాట‌లు చెబితే.. ఏపీలో ఆ పార్టీకి స‌మాధి క‌ట్టేయ‌టం ఖాయం. అందుకే.. హోదా విష‌యంలో ర‌ఘువీరా చెప్పే మాట‌ల‌కు మ‌రింత క్లారిటీ తీసుకోవ‌టం అవ‌స‌రం. ఇదిలా ఉంటే.. టీడీపీతో పొత్తు అన్న‌ది రూమ‌ర్ అని.. పొత్తుల విష‌యం గురించి త‌మ అధినేత రాహుల్ చూసుకుంటార‌ని చెప్ప‌టం ద్వారా.. టీడీపీతో పొత్తు విష‌యాన్ని ర‌ఘువీరా లైవ్ లోనే ఉంచార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News