వారికి రూ.50వేలు.. కోటి కి రూ.2లక్షలు
రాజకీయం అంటే గుర్తుకొచ్చే కాంగ్రెస్ దగ్గర నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ లబ్థి పొందాలనుకోవటం తప్పించి మరొకటి లేని కాంగ్రెస్ నేతలు పుణ్యమే.. ఏపీ రాష్ట్రం ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది. రాష్ట్ర విభజనను ఇష్టారాజ్యంగా చేయకుండా కాస్తంత ఆలోచించాలన్న బుద్ధి కాంగ్రెస్ అధినాయకత్వానికి లేకుండా పోతే.. ఇష్టారాజ్యంగా విభజన చేస్తున్నారని.. దీని కారణంగా ఏపీ ప్రజలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కి చెప్పినోడే లేడు.
నిత్యం అమ్మకు విధేయతను ప్రదర్శించటం తప్ప.. అమ్మ చేస్తున్న వెధవ పనుల కారణంగా.. భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లాంచాల్సి ఉంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు హెచ్చరించిది ఏ మాత్రం కనిపించదు.
ఈ రోజున పీకల్లోతు కష్టాల్లో ఏపీకి చిక్కుకుంది. వారి సమస్యల పట్ట అయినా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. వారి మాటల్లోనూ.. చేతల్లోనూ నిజాయితీ కనిపించదు. ఏపీ అంటే వారికి చిన్నచూపని.. కేవలం భావోద్వేగాన్ని వాడుకోవాలన్న దుర్బుద్ధి మాత్రమే తప్ప.. ఏపీ మీద ఎలాంటి ప్రేమ వారికి లేదన్న విషయం తాజా పరిణామాలతో చెప్పకనే చెప్పేయొచ్చు.
ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్ని కలిసి.. పరామర్శించేందుకు.. వారికి అండగా ఉంటామని చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటించటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న కొంతమంది అన్నదాతల్ని కలిసి వారికి అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా వారి చేతిలో చెక్కు పెట్టారు.
అందులో రూ.50వేల మొత్తం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే రాహుల్ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటాంబాల్ని కలిసి.. వారి సమస్యలు విని రూ.లక్ష పరిహారంగా కింద అందిస్తే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా రూ.50వేలు మాత్రమే ఇచ్చారు. ఇదిలా ఉంటే తిరుపతిలో నిర్వహించిన పోరు సభలో తిరుపతికి చెందిన మునికోటి ఆత్మహత్యాయత్నం చేసుకోవటం.. తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ప్రస్తుతం వేలూరు సీఎంసీకి తరలించటం తెలిసిందే.
ఈ సందర్భంగా మునికోటి కుటుంబ సభ్యులకు ఏపీ కాంగ్రెస్ నేతలు రూ.2లక్షలు అవసరాల కోసం ఇవ్వటం గమనార్హం. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.50వేలతో సరిపుచ్చిన కాంగ్రెస్.. తాజా ఉదంతంలో రూ.2లక్షలు ఇచ్చిన తీరు చూస్తుంటే.. సాయంగా ఇచ్చే మొత్తం రాజకీయ పెట్టుబడి మాదిరిగా అనిపించక మానదు. పేరు కోసం.. ప్రచారం కోసం ఇవ్వటమే తప్పించి.. నిజంగా ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పార్టీకి కమిట్ మెంట్ ఉంటే.. తన పార్టీ సభ్యులను ఐదు రోజులు సస్పెన్షన్ వేటు వేస్తే రచ్చ రచ్చ చేస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా కానీ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ కానీ.. ఒక్కరోజంటే ఒక్కరోజు అయినా పార్లమెంటు బయట ఆ స్థాయిలో పోరాటం చేశారా? అన్న ప్రశ్న వేసుకుంటే.. సమాధానం ఎవరికి వారికి ఇట్టే అర్థమైపోతుంది.