• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారతీయ పిల్లలను వదలరా?...

భారతీయ పిల్లలను వదలరా? అమెరికా స్కూల్లలోనూ తగ్గని జాత్యహంకారం..

By - Tupaki Desk
Update: 2022-12-20 11:30 GMT
తెల్లతోలు కప్పుకున్న అమెరికన్లు తమ రంగు కాని వారిని అవమానిస్తున్నారు. ఈసడిస్తున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయులకు అవమానాలు తప్పడం లేదు. అక్కడి జాత్యహంకారం తగ్గడం లేదు. స్కూలు దశలోనూ భారతీయ పిల్లలను అవమానిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.  యువ భారతీయ-అమెరికన్‌లు ప్రీస్కూల్‌లోనే జాతి పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇది భారతీయులను షాక్ కు గురిచేస్తోంది.

అమెరికాలో నివసిస్తున్న 3.5 మిలియన్లకు పైగా దక్షిణాసియావాసులలో ఉన్న యువ భారతీయ-అమెరికన్‌లు, ప్రీస్కూల్‌ దశలోనే క్రమం తప్పకుండా జాతి వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వారి గుర్తింపుల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. రెండోతరం భారతీయ-అమెరికన్ యుక్తవయస్కులు "ప్రత్యేకంగా తమ గుర్తింపును అన్వేషించడం.. ఏర్పరచుకోవడం వలన వివక్షకు గురవుతున్నారని తేలింది. ఈ అధ్యయనం 12-17 సంవత్సరాల మధ్య వయస్సు గల తొమ్మిది మంది భారతీయ-అమెరికన్‌లను సర్వే చేసింది. వారు పాఠశాలలో తోటివారితో తమ అనుభవాల గురించి మాట్లాడారు. వారు భారతీయ సంస్కృతి, భాష లేదా మతం గురించి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారని తేలింది.

"ఒక్క రాయిని చూపించి 'ఇదిగో ఇది నీ దేవుడు' అని అవమానిస్తున్నారని.. కొన్ని నల్లచుక్కలున్నాయి.. వారిని దూరంగా పెట్టాలి  అని ఒక తెల్ల అమెరికా పిల్లవాడు అన్నాడని పలువురు భారతీయ పిల్లలు సర్వేలో బాధను వెళ్లగక్కారు. ఇదే నీ దేవుడా?' అని నుదిటిపై ఉంచి కొందరు అవమానించారని" అని ఒక భారతీయ అమెరికన్ విద్యార్థి వాపోయాడు.

ఆహారం గురించి.. భారతీయ యాసను వెక్కిరిస్తారని.. 'నాకు భారతీయ ఆహారం ఇష్టం లేదు' అని కొందరు తిట్టిపోస్తారని.. 'ఇది చాలా దుర్వాసనగా ఉందని అవమానిస్తారని మరికొందరు విద్యార్థులు ఆవేదన చెందారు.  ద్వేషపూరిత నేరాలను నివేదించడమే కాకుండా యుక్తవయస్కులు తమ భారతీయ గుర్తింపును అమెరికన్‌గా చూడాలనే కోరికను వెలిబుచ్చారు.  వారు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా చర్చించారు. వారిలో కొందరు తమ స్నేహితుల వలె తెల్లటి చర్మం కలిగి లేరని.. ప్రీస్కూల్‌లోనే "అమెరికన్"గా ఉండాలనే కోరికతో కోపంగా ప్రవర్తిస్తున్నారని నివేదించారు..

'ఇంటర్వ్యూ చేసినవారు కుటుంబంతో.. పాఠశాలలో ఉన్నప్పుడు విభిన్నంగా మాట్లాడేవారు.. ప్రవర్తించారని' జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించబడిన అధ్యయనం తెలిపింది. "ఇండియన్-అమెరికన్ అనే పదం  మీరు రెండు ప్రపంచాల మధ్య జీవిస్తున్నారని అర్థం,   మీ తల్లిదండ్రులు పాశ్చాత్య ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు.. పాశ్చాత్య ప్రపంచం భారతీయ ప్రపంచాన్ని అర్థం చేసుకోదు, మీరు రెండు ప్రపంచాల మధ్య జీవిస్తున్నారు. ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మీకు జ్ఞానం ఉండాలి వాటిని బ్యాలెన్స్ చేయండి" అని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో  ఈ కౌమారదశలో ఉన్నవారు తాము ఏ సమూహానికి సరిపోరని భావించారు. భారతీయ-అమెరికన్ యువత ప్రీస్కూల్ , ఎలిమెంటరీ స్కూల్‌లోనే వివక్షను ఎదుర్కోవడం తరుచుగా జరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. ఈ కౌమారదశలో ఉన్నవారు అందరూ రెండోతరంగా వర్గీకరించబడుతున్నారని తేలింది. వారు అమెరికాలో జన్మించారు. 18 సంవత్సరాల వయస్సు తర్వాత భారతదేశం నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు పుట్టారు. వీరు కూడా ఇక్కడ వివక్షకు గురవుతున్నట్టు తేలింది.
 
ఆసియా భారతీయులు 1800 చివరలో అమెరికాకు వలస వచ్చిన మొదటి దక్షిణాసియా వాసులు. ప్రస్తుతం అమెరికాలో అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు ఇప్పటికీ వివక్షకు గురవుతున్నట్టు తేలింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AmericanSchool 
  • IndoAmericanStudents 
  • TexasAMUniversitySchool 
  • PublicHealthStudy 
  • RacismonIndianStudentsinUS 
  • RacisminSchools 

Similar News

వ‌క్తిగ‌త బ‌లంకంటే.. కూట‌మినే ప్ర‌జ‌లు ఆద‌రించారు: బాబు

2026-11-21 17:23 GMT

వెంటిలేట‌ర్ నుంచి లేచి అడుగులు వేస్తున్నాం.. త్వ‌ర‌లో ప‌రుగు: చంద్ర‌బాబు

2026-11-21 17:23 GMT

చాలా హోంవ‌ర్క్ చేశాను.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చాను: చంద్ర‌బాబు

2026-11-21 17:15 GMT

మేనరికం పెళ్లిళ్లు.. మనకు ఎన్నాళ్లీ బాధ?

2026-11-21 17:04 GMT

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

బంగారంలో రీనియం కలిపేసి మోసం.. ఏ మెషీన్ కు, మనుషులకు చిక్కని దొంగ బంగారం స్కామ్

2026-11-21 06:33 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

Copyright @2026

Powered by Blink CMS