• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  కన్నీటి కడలిలో ఆశాకిరణం.....

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

| రూ.9 కోట్లు ఖరీదు చేసే అరుదైన వ్యాధి మందును హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శివరంజని సంతోష్ కేవలం రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చారు. నెదర్లాండ్స్ ఫార్మసీ సహకారంతో ఏడుగురు AHDS బాధిత చిన్నారులకు ఏడాది పాటు మందులను ఉచితంగా అందించారు. ఆమె కృషితో ఏడు కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.

By - A.N.Kumar
Update: 2026-11-21 07:30 GMT

కన్నబిడ్డ కళ్లముందే అరుదైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తుంటే ఏ తల్లిదండ్రులైనా తల్లడిల్లిపోతారు. కానీ ఆ బిడ్డను కాపాడే మందు ధర ఏకంగా రూ.9 కోట్లు అని తెలిస్తే ఆ నిస్సహాయత.. గుండెకోత ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆశలు వదులుకున్న ఏడుగురు పసిపిల్లల తల్లిదండ్రులకు దేవతలా అండగా నిలిచారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్. వైద్యం అంటే కేవలం నాడి పట్టి మందులు రాయడం మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ప్రాణాలను నిలబెట్టడానికి వ్యవస్థతోనైనా పోరాడటం అని ఆమె నిరూపించారు.

అల్లన్ హెర్న్ డోన్ డడ్లీ సిండ్రోమ్ (ఏహెచ్.డీఎస్) అనేది అత్యంత అరుదైన, ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి. దీని బారిన పడిన చిన్నారుల మెదడు ఎదుగుదల ఆగిపోతుంది.. కదలికలు కరువవుతాయి. ఈ పసివాళ్ల జీవితాల్లో వెలుగు నింపే ఏకైక ఆశాకిరణం ‘టిరాట్రికాల్’ అనే ఔషధం. అయితే ఈ మందు ధర సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంది. ఒక్కో చిన్నారికి ఏడాది పాటు చికిత్స అందించాలంటే సుమారు రూ.9 కోట్లు ఖర్చవుతుంది. ఆస్తులు అమ్ముకున్నా జీవితకాలం కష్టపడినా అంత డబ్బు కూడబెట్టడం మధ్యతరగతి, పేద కుటుంబాలకు అసాధ్యం. మందు కళ్లముందే ఉన్నా కొనలేని నిస్సహాయతతో ఆ తల్లిదండ్రులు రోజురోజుకూ కుమిలిపోయారు.

ఆ చిన్నారుల వేదనను కళ్లారా చూసిన డాక్టర్ శివరంజని సంతోష్ చలించిపోయారు. ఎలాగైనా ఆ బిడ్డలను బతికించాలని సంకల్పించారు. ఔషధ కంపెనీల గుత్తాధిపత్యంపై పోరాడుతూనే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌లోని ఓ ఫార్మసీని సంప్రదించి వారి సహకారంతో అద్భుతాన్ని సాధించారు. ఆమె అవిశ్రాంత కృషి ఫలించి రూ.9 కోట్లు పలికే ఏడాది మందుల కోటాను కేవలం రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తీసుకురాగలిగారు. అంతేకాదు ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు ఈ మందులను ఉచితంగా అందించి వారి జీవితాల్లో కొత్త ఊపిరి పోశారు.

డాక్టర్ శివరంజని సేవలు కేవలం ఈ ఒక్క ఘటనకే పరిమితం కాలేదు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఆమె సాగిస్తున్న ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.. పిల్లల ప్రాణాలు తీసే డీహైడ్రేషన్ సమయంలో వాడే ఓఆర్ఎస్ పేరుతో చక్కెర పానీయాలను అమ్ముతున్న కంపెనీలపై ఆమె న్యాయపోరాటం చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్ పద్ధతిపై సామాన్యులకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్యపరమైన తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ శాస్త్రీయమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు.

వైద్య వృత్తి వ్యాపారమయంగా మారుతున్న ఈ రోజుల్లో.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శివరంజని సంతోష్ నిజంగానే సమాజానికి దొరికిన ఒక వరం. ఆమె పట్టుదల వల్ల నేడు ఏడు కుటుంబాల్లో చిరునవ్వులు విరిశాయి. ఇలాంటి వైద్యులు మరికొందరు ఉంటే.. డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క ప్రాణమూ గాల్లో కలిసిపోదు..

Tags:    
  • shivaranjanisanthosh 
  • hyderabaddoctor 
  • raredisease 
  • ahds 
  • tiratricol 

Similar News

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

షాకింగ్ న్యూస్...ఏపీని పీడిస్తున్న రెండు జబ్బులు

2026-11-15 20:52 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

క్యాన్సర్ పై పోరులో ముందడుగు.. పర్సనలైజ్డ్ క్యాన్సర్ వాక్సిన్ పై బిగ్ అప్డేట్!

2026-11-15 20:12 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

Copyright @2026

Powered by Blink CMS