• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Rajasthan >  బంగారంలో రీనియం కలిపేసి...

బంగారంలో రీనియం కలిపేసి మోసం.. ఏ మెషీన్ కు, మనుషులకు చిక్కని దొంగ బంగారం స్కామ్

| రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రీనియం లోహంతో బంగారం కల్తీ చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది. ఈ లోహం కలిపిన నగలను ఎక్స్‌ఆర్ఎఫ్ యంత్రాలు, బీఐఎస్ హాల్‌మార్కింగ్ కేంద్రాలు కూడా 22 క్యారెట్ల బంగారంగా గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి. బంగారం కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమైన షోరూమ్‌లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-21 06:33 GMT

మన దేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. అది ఒక ఎమోషన్.. ఆపదలో ఆదుకునే ఆస్తి.. అంతకుమించి స్టేటస్ సింబల్.. బంగారం లాంటి మనిషి అని పొగడటం మనకు అలవాటు. కానీ ఇప్పుడు ఆ బంగారమే మనిషి లాంటి మోసగాడు అయిపోయింది. మొన్నటిదాకా రాగి, వెండి కలిపి కల్తీ చేసేవారు. కానీ మన కేటుగాళ్ల తెలివితేటలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఏకంగా విమానాల జెట్ ఇంజిన్లలో వాడే రీనియం అనే లోహాన్ని తీసుకొచ్చి మన మెడలో గొలుసుల్లో కలిపేస్తున్నారు.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగుచూసిన ఈ హైటెక్ గోల్డ్ స్కామ్ చూస్తుంటే మన స్కామర్లకు నోబెల్ బహుమతి ఇవ్వాలా లేక జైల్లో పెట్టాలా అనిపిస్తోంది. ఒక ప్రయోగంలో భాగంగా 20 క్యారెట్ల బంగారానికి కాస్త రీనియం పౌడర్‌ అద్ది.. దానికి రాజస్థానీ నగ రూపు ఇచ్చి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. విచిత్రం ఏంటంటే.. లక్షలు పోసి కొన్న ఆధునిక ఎక్స్.ఆర్ఎఫ్ టెస్టింగ్ మెషీన్లు కూడా ఆహా ఏమి స్వచ్ఛత.. ఇది పక్కా 22 క్యారెట్ల బంగారమే అని కితాబిచ్చేశాయి. అంతేనా సాక్షాత్తు బీఐఎస్ హాల్‌మార్కింగ్ కేంద్రం కూడా దీనికి 22 కేరట్ 916 అనే ఆధార్ కార్డు లాంటి ముద్ర వేసి మరీ సర్టిఫికెట్ ఇచ్చేసింది..

అసలు ఈ రీనియం కథేంటంటే.. దీని సాంద్రత బంగారం కంటే ఎక్కువ. అంటే నగల బరువు పెరుగుతుంది కానీ అందులో అసలు బంగారం మాత్రం 81.73 శాతమే ఉంటుంది. మిగతాదంతా విమానాల విడిభాగాల తయారీలో వాడే లోహమన్నమాట.. ఇక దీని సరఫరా ఎక్కడి నుంచో ప్రత్యేకంగా చెప్పాలా? ఎప్పటిలాగే మన ఆత్మనిర్భర్ స్కామర్లకు ముడిసరుకు చైనాలోని షెన్‌జెన్ నుంచే దిగుమతి అవుతోంది. గ్రాము రూ. 5 వేల చొప్పున.. 300 రూపాయల కొరియర్ ఛార్జీతో ఇంటికే డెలివరీ.. ఇటు వినియోగదారుడికి మాత్రం తులానికి దాదాపు రూ. 14,700 చొప్పున జేబుకు చిల్లు.

సాధారణంగా బంగారం కొనేటప్పుడు హాల్‌మార్క్ ఉందా? హెచ్.యూఐడీ నంబర్ ఉందా? అని భూతద్దం పెట్టి మరీ చూస్తాం. ఇప్పుడు ఆ హాల్‌మార్క్ మెషీన్లకే కళ్ళు గంతలు కట్టే టెక్నాలజీ వచ్చేసింది. ఉపరితలాన్ని మాత్రమే స్కాన్ చేసే ఎక్స్.ఆర్ఎఫ్ మెషీన్లు లోపల దాగున్న ఈ చైనా రీనియం మాయను పసిగట్టలేక చేతులెత్తేస్తున్నాయి.

ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైందంటే.. రేపు మనం కొన్న బంగారు నగలను కష్టకాలంలో తాకట్టు పెట్టడానికి వెళ్తే ఇది బంగారం కాదు బాబూ.. విమానం ఇంజిన్ తుక్కు అని బ్యాంకు వాళ్లు మొహం మీదే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బంగారం కొనేటప్పుడు కేవలం మెరుపు చూసి మురిసిపోకుండా.. నమ్మకమైన షోరూమ్‌లలోనే కొనడం ఉత్తమం. లేదంటే మన డబ్బు గాల్లో ఎగిరిపోవడం ఖాయం సుమీ..

Tags:    
  • goldscam 
  • rajasthan 
  • jodhpur 
  • rhenium 
  • goldfraud 

Similar News

100 మంది బౌన్సర్లు.. కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఈ గుర్రం రాచరికం వెనుక అసలు కథ

2026-11-17 10:01 GMT

యూట్యూబర్ ను సెల్ఫీ పేరుతో దగ్గరకొచ్చి ఏకంగా 'లిప్ కిస్' అడిగాడు.. తర్వాత చూడాలి..

2026-11-17 06:51 GMT

కలకలం : బీజేపీ నోట పాకిస్తాన్ కు మద్దతు !

2026-10-16 04:23 GMT

బీజేపీకి ఒకే ఒక్క ఓటు...ఇది గిన్నిస్ రికార్డే !

2026-09-15 04:13 GMT

సీజేపీ 'దెబ్బ'.. సీఎం అబ్బా.. రాజస్థాన్ స్కూళ్లకు రూ.12,500 కోట్లతో ఓ భారీ 'కాస్మోటిక్ మేకప్'

2026-08-24 17:10 GMT

ఓ సైనికుడికి కష్టం : దేశం కోసం 3 యుద్ధాలు.. సొంత భూమి కోసం నాలుగో యుద్ధం..

2026-07-13 03:07 GMT

బుల్డోజర్ న్యాయం.. మైనర్ బాలిక అత్యాచార ఇష్యూలో 3 హోటళ్ల కూల్చివేత!

2026-07-02 07:09 GMT

మోడీ మాస్క్‌తో మొబైల్ షాపుల్లో దొంగతనం.. సినిమాను తలపించేలా!

2026-06-30 18:31 GMT

భ‌గ‌భ‌గ‌లో ACతో పనే లేదు.. జైపూర్ రూఫ్‌టాప్ టెక్నిక్‌పై ఆనంద్ మహీంద్రా ప్ర‌శంస‌లు!

2026-05-26 08:30 GMT

2026 వరల్డ్ బెస్ట్ కల్చరల్ సిటీస్.. ఇండియాలో ఏది.. ఎలా డిసైడ్ చేస్తారు?

2026-05-15 19:30 GMT

నగదునే ప్రసాదంగా ఇచ్చే వింత ఆలయం.. ఎక్కడ ఉందంటే..?

2026-05-08 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS