పురంధేశ్వరికి, భువనేశ్వరికి గొడవలున్నాయా?

Update: 2017-03-05 07:02 GMT
ఇద్దరూ ఎన్టీఆర్ కుమార్తెలే.. కానీ, ఒకరితో ఒకరికి సరిగా పొసగడం లేదట. రాజకీయ కారణాల వల్ల అక్కాచెల్లెళ్ల  మధ్య బంధంపైనా ప్రభావం పడుతుందట.. ఈ సంగతి చెప్పింది ఎవరో కాదు.. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి. ఆమెకు విభేధాలున్నది తన సోదరి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో.  ఇంకా ఏపీ రాజకీయాలు, తమ కుటుంబ రాజకీయాలకు సంబంధించిన అనేక అంశాలను ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురంధేశ్వరి వెల్లడించారు.
    
సీఎం చంద్రబాబునాయుడు వైఫ్ భువనేశ్వరి‌తో రాజకీయపరమైన విభేదాలున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు.  రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో తాము సాగుతున్నందున భేధాభిప్రాయాలు సహజమేనన్నారు. అయితే.. వేరే కారణాల వల్ల తాము గొడవలు పడిన సందర్భాలేవీ లేవని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ను వీడిన తరువాత జాతీయ పార్టీలో ఉండాలన్న కోరికతోనే బీజేపీలోకి వచ్చినట్లు చెప్పారు.
    
టీడీపీలోకి గతంలో తనకు ఆహ్వానమేమీ రాలేదని.. పిలవాలని వారు కోరుకున్నారేమో తనకు తెలియదు కానీ తాను మాత్రం వెళ్లాలని ఎన్నడూ అనుకోలేదని చెప్పుకొచ్చారు. భువనేశ్వరితో వ్యక్తిగత కారణాల వల్ల విభేదాలేమీ లేవని స్పష్టం చేశారు. రాజకీయాలు, వ్యక్తిగత జీవితం వేరు కాబట్టి ఆ ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడరాదనే తాను కోరుకుంటానని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News