కుక్కపిల్లల్నిని రాక్షసంగా కాల్చేసిన పిల్లలు
తెలిసి తెలియని వయసు పిల్లలే అయినా.. వారు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక నోట మాట రాని పరిస్థితి. నిత్యం చూసే కార్టూన్ ఛానళ్ల ప్రభావమో.. లేక చట్టూ ఉన్న హింసాయుత వాతావరణమో కానీ.. వారి చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారటమేకాదు.. మరీ ఇంత దారుణంగా.. పైశాచికంగా వ్యవహరించటం ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
వినేందుకే ఒళ్లు జలదరించే ఉదంతం హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో చోటు చేసుకుంది. ఆరుగురు పిల్లలు మూడు కుక్క పిల్లల్ని పట్టుకొచ్చి మంటల్లో కాల్చేయటమే కాదు.. అవి ప్రాణభయంతో బయటకు వచ్చేప్రయత్నం చేస్తుంటే.. రాక్షసంగా కర్రలతో వాటిని మంటల్లో వేస్తూ.. ఆనందించటం కనిపించింది. హృదయవిదారకంగా ఉన్న ఈ దృశ్యాల్ని చూస్తే మనసంతా చేదుగా అయిపోవటం ఖాయం. ఇంత రాక్షసంగా వ్యవహరించి వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం చూస్తే.. వారి పైత్యం ఎంత పరాకాష్టకు చేరుకుందో ఇట్టే తెలుస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించి ఐదుగురు అనుమానిత పిల్లల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతు ప్రేమికుల దగ్గర నుంచి మనసున్న ప్రతిమనిషి అవాక్కు అయ్యే ఈ వీడియోను చూస్తే.. ఈ పిల్లలు ఎంత అమానుషంగా వ్యవహరించారో అర్థమవుతుంది.
Full View