పబ్జి కోసం రూ.16 లక్షలు తగలేశాడట
సాంకేతికత అందుబాటులోకి రావటంతో పలు సౌకర్యాలు లభించటం ఖాయమన్న మాట వినిపిస్తుంటుంది. కానీ.. సౌకర్యాల సంగతేమో కానీ.. సమస్యలు మాత్రం తప్పవని చెబుతుంటారు. తాజాగా వెలుగు చూసిన వైనం చూస్తే.. ఇది నిజమనిపించక మానదు. పబ్జీ గేమ్ కోసం ఒక కుర్రాడు ఏకంగా రూ.16లక్షలు తగలేసిన వైనం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. గతంలో పబ్జీ గేమ్ కోసం ప్రాణాలు కొందరు తీసుకుంటే.. తాజాగా లక్షలాది రూపాయిల్ని ఇంట్లో వారికి తెలీకుండా ఖర్చు చేసిన ఉదంతాన్ని చూస్తే.. పబ్జీతో ఎన్ని డేంజర్లు ఉన్నాయన్నది ఇట్టే అర్థం కాక మానదు.
పంజాబ్ కు చెందిన పదిహేడేళ్ల టీనేజర్ కు పబ్జీ పిచ్చ ఒక రేంజ్లో ఉంటుంది. ఉద్యోగంలో భాగంగా తండ్రి వేరే ప్రాంతంలో ఉంటారు. తల్లి దగ్గర ఉండే ఈ కుర్రాడి మీద సరైన నియంత్రణ లేకపోవటంలో పబ్జి ఊబిలోకి కూరుకుపోయాడు. ఈ ఆట మోజులో పడి పబ్జీ మొబైల్ అకౌంట్ ను అప్ గ్రేడ్ చేసుకునేందుకు రూ.16లక్షల్ని ఖర్చుచేశాడు. తన తండ్రి మూడు బ్యాంకుఖాతాల్లో దాచుకున్న మొత్తాన్ని వాడేశాడు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇంత భారీ మొత్తంలో బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్న విషయాన్ని ఆ బాలుడి తండ్రి గుర్తించలేకపోయాడు. ఇంతకీ.. అంత మొత్తాన్ని దేని కోసం వాడాడంటే.. టీం సభ్యులతో కలిసి ఇన్ యాప్ కొనుగోళ్ల కోసం వెచ్చించాడు. ఈ మధ్యన బ్యాంకుస్టేట్ మెంట్ చేసిన కుర్రాడి తండ్రి తన ఖాతాల్లో నుంచి రూ.16 లక్షలు డ్రా అయిన విషయాన్ని చూసి షాక్ తిన్నాడు. బ్యాంకుకు ఫోన్ చేసి ఆరాతీయగా అసలు విషయం బయటకు వచ్చింది. సో.. మీ దగ్గర్లోని వారు పబ్జీ గేమ్ ఆడుతుంటే.. వారి విషయంలో ఒక కన్ను కాదు.. రెండు కళ్లు వేయటమే కాదు..ఆ మత్తులో పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.